వారణాసి నుండి మోడీ పోటీ, ఉమా భారతికి ఝాన్సీ
న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ఎక్కడి నుండి పోటీ చేస్తారనే ఉత్కంఠకు దాదాపు తెరపడినట్లుగా చెప్పవచ్చు. వివరాల మేరకు... మోడీ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని వారణాశి నుండి పోటీ చేయనున్నారు.
ప్రస్తుతం వారణాశి ఎంపీగా బిజెపి సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీ ఉన్నారు. 2014 ఎన్నికల్లో జోషీ స్థానంలో మోడీ పోటీ చేయనున్నారు. జోషీ కాన్పూర్ నుండి పోటీ చేయనున్నారు. బిజెపి జాతీయ అధ్యక్షులు రాజ్‌నాథ్ సింగ్ లక్నో నుండి పోటీ చేస్తారు. ఆయన 2009లో ఘజియాబాద్ నుండి పోటీ చేశారు.

లక్నో గతంలో బిజెపి అగ్రనేత, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి పోటీ చేశారు. లక్నో నుండి ప్రస్తుతం లల్జీ టాండన్ ఉన్నారు. ఆయన స్థానంలో రాజ్‌నాథ్ సింగ్ పోటీ చేయనున్నారు.
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ బిజెపి నేత కల్యాణ్ సింగ్ ఈటా నుండి పోటీ చేయనున్నారు. మధ్యప్రదేశ్ మాజీ సిఎం, సీనియర్ నేత ఉమా భారతి ఝాన్సీ నుండి పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. యోగి ఆదిత్యనాథ్ గోరక్‌పూర్ నుండి చేస్తారు. కాంగ్రెసు పార్టీ నుండి బిజెపిలోకి వస్తారని భావిస్తున్న ఎంపి జగదాంబిక పాల్ దుమ్రియాగంజ్ నుండి పోటీ చేసే అవకాశాలున్నాయి.
కాగా, బిజెపి 54 అభ్యర్థులతో కూడిన మొదటి లిస్టును గురువారం విడుదల చేసింది. మహారాష్ట్ర నుండి 17, పశ్చిమ బెంగాల్ నుండి 17, ఒడిశా నుండి ఆరుగురు, జమ్ము కాశ్మీర్ నుండి ఐదుగురు, హిమాచల్ ప్రదేశ్ నుండి ముగ్గురు, గోవా నుండి ఇద్దరు, అరుణాచల్ ప్రదేశ్ నుండి ఇద్దరు, మణిపూర్ నుండి ఇద్దరి పేర్లను విడుదల చేసింది.












Click it and Unblock the Notifications