Revenge: గుహలో భార్యతో ఎంజాయ్, అదే గుహలో భార్య గొంతుకోసి హత్య, అత్త ఎఫెక్ట్, ఫేమస్ ఫ్లేస్ !
నైనిటాల్/చెన్నై: భార్య భర్తల స్టోరీ థ్రిల్లర్ సినిమాను తలతన్నే విధంగా ఉంది. ఇద్దరి జీవితంలో ఎన్నోన్నో మలుపులు తిరిగాయి. యువతిని వెంటపడి వేధింపులకు గురి చేసిన యువకుడు చివరికి ఆమెను రేప్ చేశాడు. తన మీద రేప్ చేశాడని కేసు పెట్టిన యువతి అతన్ని జైలుకు పంపించింది. జైలు నుంచి బయటకు వచ్చిన యువకుడు అదే యువతిని అందరి సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. భార్యతో కలిసి చక్కగా కాపురం చేస్తున్నట్లు నటించిన భర్త కరోనా వైరస్ ను కూడా లెక్క చెయ్యకుండా అతని లెక్క ప్రకారం భార్యను విహారయాత్రలకు పిలుచుకుని వెళ్లాడు. భార్య, భర్తల సంసారంలో భార్య తల్లి ఎంట్రీ ఇచ్చింది. అంతే హిమాలయాల సమీపంలోకి విహారయాత్రకు వెళ్లిన దంపతులు అక్కడి అందమైన గుహలో కామకోరికలు తీర్చుకున్నారు. సీన్ కట్ చేస్తే భార్య గొంతు కోసి చంపేసిన భర్త నీట్ గా చేతులు దులుపుకుని ఇంటికి వెళ్లిపోయాడు.

వెంటపడి వేధించిన రాజేష్
ఢిల్లీలో నివాసం ఉంటున్న రాజేష్ అనే యువకుడు అందమైన అమ్మాయిల వెంటపడుతున్నాడని సమాచారం. ఉత్తరాఖండ్ లోనే నివాసం ఉంటున్న స్వప్నా (పేరు మార్చడం జరిగింది) అనే కత్తిలాంటి అమ్మాయి మీద రాజేష్ మనుసుపడ్డాడు. స్వప్నా వెంటపడిన రాజేష్ ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పాడు.

అక్కడ ఎంజాయ్ చేసిన లవర్స్
రాజేష్ వెంట తిరిగిన కొంతకాలానికి స్వప్నా కూడా అతని ప్రేమలో పడిపోయింది. రాజేష్, స్వప్నా కలిసి విహారయాత్రలకు వెళ్లి పిచ్చపాటిగా ఎంజాయ్ చేశారు. రాజేష్ చిలిపి చేష్టలు రుచి చూసిన స్వప్నా హద్దులు దాటేసింది. అంతే పెళ్లికి ముందే రాజేష్, స్వప్నా కాపురం చేసేశారు.

రేప్ కేసులో జైలుపాలైన ప్రియుడు
పెళ్లి చేసుకుంటానని నమ్మించి స్వప్నాను అనుభవించిన రాజేష్ తాను పెళ్లి చేసుకోనని ఎదురు తిరిగాడు. ప్రియుడు రాజేష్ ను పెళ్లి చేసుకోవాలని అనేక రకాలుగా నచ్చచెప్పిన స్వప్నా చివరికి విసిగిపోయింది. రాజేష్ తన మీద అత్యాచారం చేశాడని స్వప్నా కేసు పెట్టింది. పోలీసులు రాజేష్ మీద రేప్ కేసు నమోదు చేసి అతన్ని జైలుకు పంపించారు.

సింపుల్ గా మ్యారేజ్
జైలు జీవితం గడిపిన రాజేష్ తరువాత స్వప్నాను పెళ్లి చేసుకుంటానని షరతులు పెట్టి బెయిల్ మీద బయటకు వచ్చాడు. 2020 డిసెంబర్ నెలలో రాజేష్ అతని ప్రియురాలు స్వప్నాను ఉత్తరాఖండ్ లోని ఓ దేవాలయంలో సింపుల్ గా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికి స్వప్నా కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారు.

హిమాలయాల అంచుల్లో ?
ఆరు నెలల వరకు భార్య స్వప్నాతో చక్కగా కాపురం చేస్తున్నట్లు రాజేష్ నటించాడు. భార్యతో కలిసి చక్కగా కాపురం చేస్తున్నట్లు నటించిన భర్త కరోనా వైరస్ ను కూడా లెక్క చెయ్యకుండా అతని లెక్క ప్రకారం భార్యను విహారయాత్రలకు పిలుచుకుని వెళ్లాడు. తన మీద రేప్ కేసు పెట్టి జైలుకు పంపించిన భార్య స్వప్నా మీద రాజేష్ పగ అలాగే ఉండిపోయింది. గత నెల జూన్ లో భార్య స్వప్నాను విహారయాత్రకు పిలుచుకుని వెలుతున్నట్లు నటించిన రాజేష్ ఆమెను హిమలయాల సమీపంలోని నైనిటాల్ ప్రాంతానికి పిలుచుకుని వెళ్లాడు.

గుహలో ఎంజాయ్...... అక్కడే ఫినిష్
హిమలాయ అంచుల్లో ఉన్న సుందరమైన ప్రాంతాల్లో సంచరించిన రాజేష్, స్వప్నా ఆరోజు చాలా సమయం అక్కడే గడిపారు. హిమాలయాల సమీపంలోకి విహారయాత్రకు వెళ్లిన దంపతులు అక్కడి అందమైన గుహలోకి వెళ్లారు. ఇక్కడ మనం ఎంజాయ్ చేద్దామని భర్త రాజేష్ అతని భార్య స్వప్నాను బలవంతం చేశాడు. భర్త రాజేష్ బలవంతం చెయ్యడంతో ఇద్దరూ అదే గుహలో కామకోరికలు తీర్చుకున్నారు. అదే గుహలో భార్య స్వప్నా గొంతు కోసి చంపేసిన భర్త నీట్ గా చేతులు దులుపుకుని ఇంటికి వెళ్లిపోయాడు.

ఇద్దరి ఫోన్ కాల్స్ ఒకే టవర్ కింద
స్వప్నా ఇంటికి తిరిగిరాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు అల్లుడు రాజేష్ మీద కేసు పెట్టారు. స్వప్నా ఎక్కడికి వెళ్లిందో తెలీదని రాజేష్ పోలీసులకు చెప్పాడు. స్వప్నా చివరికి ఫోన్ కాల్స్ నైనిటాల్ సమీపంలో ఉన్నాయని, అదే సమయంలో రాజేష్ ఫోన్ కూడా అదే టవర్ కింద ఉందని పోలీసులు గుర్తించారు. రాజేష్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు బెండ్ తీశారు.

అత్త టార్చర్ ఎక్కువైయ్యింది
స్వప్నా తనను జైలుకు పంపించిన తరువాత బయటకు వచ్చి ఆమెను పెళ్లి చేసుకున్నానని, మేము చక్కగా కాపురం చేస్తుంటే స్వప్నా తల్లి మా కాపురంలో జోక్యం చేసుకుని నన్ను టార్చర్ పెట్టిందని రాజేష్ పోలీసులకు చెప్పాడు. స్వప్నా కూడా ఆమె తల్లికే వత్తాసు పలకడంతో కోపంతో తన భార్యను గుహలో చంపేశానని రాజేష్ అంగీకరించాడు. గుహలో కుళ్లిపోయిన స్వప్నా శవాన్ని స్వాధీనం చేసుకుని ఆసుపత్రికి తరలించి కేసు విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications