Revenge: విడిపోయిన భార్య, అత్తను రివాల్వర్ తో కాల్చిపారేసిన మాజీ ఆర్మీ ఉద్యోగి, కోర్టు పక్కనే, ఆంటీ మిస్!
పూణే/షిరూర్: ఆర్మీలో ఉద్యోగం చేస్తున్న సమయంలో ఓ యువకుడు పెళ్లి చేసుకున్నాడు. వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. ఆర్మీలో ఉద్యోగం చేస్తూనే సెలవుల్లో సొంత ఊరికి వెళ్లేవాడు. భర్త ఆర్మీలో పని చేస్తుండటంతో ఇంటి దగ్గర ఉంటున్న భార్య ఆడింది ఆటగా పాడింది పాటగా తయారైయ్యింది. ఇదే సమయంలో కూతురికి వత్తాసు పలుకుతున్న ఆమె తల్లి అల్లుడిని మాత్రం లెక్కలేకుండా మాట్లాడటం మొదలుపెట్టింది. భార్య అసలు మ్యాటర్ లీక్ కావడంతో ఆర్మీలో పని చేసి రిటైడ్ అయిన భర్త రగిపోయాడు.
దంపతులు విడిపోయి ఎవరి ఇళ్లల్లో వారు ఉంటున్నారు. విడాకుల కోసం దంపతులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు విచారణకు హాజరుకావడానికి భార్య ఆమె తల్లితో పాటు వెళ్లింది. మాజీ ఆర్మీ ఉద్యోగి, అతని తమ్ముడు కలిసి కోర్టు విచారణకు హాజరై కోర్టు పక్క ఆఫీసులో ఉన్న భార్య, అత్త మీద కాల్పులు జరిపాడు. తుపాకి తూటాలకు భార్య ప్రాణం పోయింది. అత్తకు తీవ్రగాయాలు కావడంతో ఆమె ఆసుపత్రిలో ఐసీయూలో ఉంది.

ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడని?
మహారాష్ట్రలోని పూణే జిల్లాలోని షిరూర్ ప్రాంతంలో దీపక్ ధావలే అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు.చాలా సంవత్సరాల క్రితం దీపక్ ధావలే (45) ఆర్మీలో చేరాడు. ఆర్మీలో ఉద్యోగం చేస్తున్న సమయంలో దీపక్ ధావలే మంజూరా అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. వివాహం చేసుకున్న దీపక్ ధావలే, మంజూరా దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు.

ఒంటరిగా ఉన్న భార్య రెచ్చిపోయింది
ఆర్మీలో ఉద్యోగం చేస్తూనే సెలవుల్లో సొంత ఊరికి వెళ్లిన దీపక్ ధావల్ అతని భార్య మంజూరాతో సంతోషంగా గడిపాడు. సెలవులు పూర్తి అయిన తరువాత ఆర్మీలో పని చెయ్యడానికి దీపక్ వెళ్లిపోయిన తరువాత ఇంటి దగ్గర ఉంటున్న అతని భార్య మంజూరా ఆడింది ఆటగా పాడింది పాటగా తయారైయ్యింది. ఊరిలో ప్రియుడిని సెట్ చేసుకున్న మంజూరా అతనితో ఎంజాయ్ చేసి ఆమె భర్త దీపక్ ను నిర్లక్షం చేసింది.

అల్లుడిని లెక్కలేకుండా మాట్లాడిన అత్త
మంజూరా అసలు విషయం ఆమె భర్త దీపక్ కు తెలిసిపోయింది. నేను ప్రతినెల డబ్బులు సంపాదించి నీకు పంపిస్తుంటే నువ్వు ఇక్కడ నీ ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్నావా ? అంటూ దీపక్ అతని భార్య మంజూరాతో గొడవ పెట్టుకున్నాడు. ఇదే సమయంలో కూతురు మంజూరాకు వత్తాసు పలుకుతున్న ఆమె తల్లి తులసాబాయ్ ఆమె అల్లుడు దీపక్ ను మాత్రం లెక్కలేకుండా మాట్లాడి అతన్ని అవమానించడం మొదలుపెట్టిందని సమాచారం. తరువాత దీపక్ ఆర్మీ నుంచి రిటైడ్ అయ్యాడు.

విడిపోయిన దంపతులు
భార్య మంజూరా అసలు మ్యాటర్ లీక్ కావడంతో ఆర్మీలో పని చేసి రిటైడ్ అయిన దీపక్ ఇంకా రగిపోయాడు. దీపక్, మంజూరా దంపతులు విడిపోయి ఎవరి ఇళ్లల్లో వారు ఉంటున్నారు. విడాకుల కోసం దంపతులు షిరూర్ సివిల్ కోర్టును ఆశ్రయించారు. షిరూర్ సివిల్ కోర్టులో విడాకుల కేసు విచారణకు హాజరుకావడానికి దీపక్ భార్య మంజూరా, ఆమె తల్లి తులసాబాయ్ తో పాటు వెళ్లింది.

కోర్టు పక్కనే భార్య, అత్తను కాల్చి పారేసిన భర్త
మంజూరా, ఆమె తల్లి తులసాబాయ్ సివిల్ కోర్టులో విచారణకు హాజరైన తరువాత కోర్టు పక్కనే ఉన్న పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ ఆవరణంకి వెళ్లారు. ఆ సమయంలో మాజీ ఆర్మీ ఉద్యోగి దీపక్, అతని తమ్ముడు కలిసి ఆటోలో వెళ్లి కోర్టు పక్కనే ఉన్న భార్య మంజూరా, అతని అత్త తులసాబాయ్ మీద రివాల్వర్ తో కాల్పులు జరిపారు. తుపాకి తూటాకు దీపక్ భార్య మంజూరా ప్రాణాలు పోయాయి.

గ్రేట్ ఎస్కేప్!
మంజూరా తల్లి తులసాబాయ్ కి తీవ్రగాయాలు కావడంతో ఆమె ఐసీయూలో ఉందని, కాల్పులు జరిపిన దీపక్, అతని సోదరుడు అదే ఆటోలో పరారైనారని పూణే రూరల్ ఎస్పీ అభినవ్ దేశ్ ముఖ్ మీడియాకు చెప్పారు. కోర్టు పక్కనే మాజీ ఆర్మీ ఉద్యోగి దీపక్ అతని భార్య మంజూరాను కాల్చి చంపేయడం కలకలం రేపింది.












Click it and Unblock the Notifications