Revenge: రౌడీషీటర్ కు ఇద్దరు భార్యలు, మధ్యలో ఓ భార్య ?, చాన్స్ చిక్కిందని ఏం చేశారంటే ?

చెన్నై/నాగపట్నం: చిన్న వయసులోనే నేరాలు చెయ్యడం మొదలు పెట్టాడు. కొడుకు తప్పు దారిపట్టడంతో అతని కుటుంబ సభ్యులు ఏమి చెయ్యలేకపోయారు. ఇదే సమయంలో కేటుగాడు ఓ యువతిని పెళ్లి చేసుకుని ఆమెతో కాపురం చేశాడు. తరువాత మరో యువతిని వివాహం చేసుకుని ఆమెతో కూడా ఎంజాయ్ చేశాడు. క్లైమాక్స్ లో సీన్ మొత్తం మారిపోయింది.

తమిళనాడులోని నాగపట్నంలోని దేవాలయం వీధిలో శివపాండి అనే అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. శివపాండి రౌడీషీటర్. శివపాండీ మీద హత్యలు, హత్యాయత్నాలు, గంజాయి సరఫరా, అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్నాడని ఇప్పటి వరకు 11 కేసులు నమోదు అయ్యాయిన నాగపట్నంలో రౌడీషీటర్ జాబితాలో శివపాండి పేరు ఉంది.

Revenge: Rowdy sheeter killed by opposite persons in Nagapattinam in Tamil Nadu.

శివపాండి గతంలో కమలి అనే యువతిని వివాహం చేసుకున్నాడు. కమిలితో శివపాండి కాపురం చేస్తున్నాడు. భర్త శివపాండి టార్చర్ తట్టుకోలేక కొంతకాలం క్రితం అతని భార్య కమిలి ఆత్మహత్య చేసుకుంది. భార్య ఆత్మహత్య చేసుకోవడంతో రౌడీషీటర్ శివపాండి కొంతకాలం ఒంటరిగా ఉన్నాడు.

భార్య కమిలి చనిపోయిన తరువాత శివపాండి సత్యా అనే యువతని వివాహం చేసుకుని ఆమెతో కాపురం చేస్తున్నాడు. రాత్రి స్నేహితులు వినోద్, రవి గణేష్ తో కలిసి మద్యం సేవించిన శివపాండి బైక్ లో బయలుదేరాడు. ఆ సందర్బంలో ప్రత్యర్థులు శివపాండిని వెంబడించారు. ముగ్గురిని అడ్డగించిన ప్రత్యర్థులు వేటకొడవళ్లతో దాడి చేశారు. ఇద్దరు స్నేహితులు తప్పించుకోవడంతో రౌడీషటీర్ శివపాండి ప్రత్యర్థులకు చిక్కిపోవడంతో అతని తల మీద ఇష్టం వచ్చినట్లు నరికి చంపేశారు. రౌడీషీటర్ శివపాండి దారుణ హత్యకు గురికావడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+