Reverse gear: నా చావుకు నా భార్య, గయ్యాలి అత్త కారణం, ఆత్మహత్య చేసుకున్న భర్త, ఎస్కేప్ !
పూణే/ చెన్నై: వివాహం జరిగినప్పంటి నుంచి దంపతుల మద్య పదేపదే గొడవలు జరుగుతున్నాయి. దంపతుల మద్య గొడవలో భార్య తల్లి ఎక్కువగా జోక్యం చేసుకోవడంతో కథ తారుమారైయ్యింది. పెద్దలు పంచాయితీలు చేసినా దంపతులకు నచ్చ చెబుతూ వచ్చినా వారు మాత్రం కలసిమెలసి ఉండలేక నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదే సమయంలో భార్య గర్బవతి అయ్యింది. నా కడుపులో ఉన్న బిడ్డను చంపడానికి తన భర్త, అతని కుటుంబ సభ్యులు టాయిలెట్ లోని లిక్విడ్ తాగాలని చిత్రహింసలకు గురి చేశారని భార్య ఆమె తల్లిని వెంట పిలుచుకుని వెళ్లి పోలీసు కేసు పెట్టింది. పోలీసులు భర్తను పిలిపించి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అదే రోజు రాత్రి భర్త నా ఆత్మహత్య కు తన భార్య, ఆమె గయ్యాలి తల్లి కారణం అంటూ రెండు పేజీల డెత్ నోట్ రాసి పెట్టి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

హ్యాపీగా పెళ్లి చేసుకున్నారు కాని ?
మహారాష్ట్రాలోని పూణే సమీపంలోని గోకోలే నగర్ లో అజిత్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. రెండు సంవత్సరాల క్రితం అజిత్ రంజనీ (ఇద్దరు పేర్లు మార్చడం జరిగింది) అనే యువతిని వివాహం చేసుకున్నాడు. పేరుకు మాత్రం వివాహం చేసుకున్న అజిత్, రంజనీ నిత్యం పోట్లాడుకుంటూనే ఉన్నారని సమాచారం.

రోజూ పోట్లాటలు..... పంచాయితీలు
వివాహం జరిగినప్పంటి నుంచి అజిత్, రంజనీ దంపతుల మద్య పదేపదే గొడవలు జరుగుతున్నాయి అజిత్, రంజనీ దంపతుల మద్య గొడవల్లో రంజనీ తల్లి ఎక్కువగా జోక్యం చేసుకోవడంతో కథ తారుమారైయ్యింది. ఎన్నిసార్లు పెద్దలు పంచాయితీలు చేసినా దంపతులకు నచ్చ చెబుతూ వచ్చినా వారు మాత్రం కలిసి మెలసి ఉండలేక నానా ఇబ్బంందులు ఎదుర్కొన్నారు.

గర్బవతి.....టాయిలెట్ లో పెనాయిల్ తాంగించాడని కేసు
ఇదే సమయంలో అజిత్ భార్య రంజనీ గర్బవతి అయ్యింది. నా కడుపులో ఉన్న బిడ్డను చంపడానికి తన భర్త అజిత్, అతని కుటుంబ సభ్యులు టాయిలెట్ లోని లిక్విడ్ తాగాలని తనను చిత్రహింసలకు గురి చేశారని భార్య రంజనీ ఆమె తల్లిని వెంట పిలుచుకుని వెళ్లి చతుత్రుంగి పోలీసు కేసు పెట్టింది. మరుసటి రోజు పోలీసులు భర్త అజిత్ ను పోలీస్ స్టేషన్ కు పిలిపించి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.

నా ఆత్మహత్యకు నా భార్య, గయ్యాలి అత్త కారణం అని డెత్ నోట్
చెయ్యని తప్పుకు పోలీసులు పిలిపించి తనను నానా మాటలు మాట్లాడరని అజిత్ ఆవేదన చెందారు.పోలీస్ స్టేషన్ కు వెళ్లిన రోజు రాత్రి నా ఆత్మహత్య కు తన భార్య, ఆమె గయ్యాలి తల్లి కారణం అంటూ రెండు పేజీల డెత్ నోట్ రాసి పెట్టిన అజిత్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. భర్త అజిత్ ఆత్మహత్య చేసుకోవడంతో అంతకు ముందు రోజు భర్త, అతని కుటుంబ సభ్యుల మీద కేసు పెట్టిన భార్య, ఆమె తల్లి ఇప్పుడు మాయం అయిపోయారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. భార్య, ఆమె తల్లి తనకు నరకం చూపిస్తున్నారని యువకుడు డెత్ నోట్ రాసి పెట్టి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం మహారాష్ట్రలో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications