Reverse: వీడు మగాడురా బుజ్జీ, నగలు లూటీ చేసి ఇంటి యజమానిని డ్రాప్ అడిగిన దొంగ !
చెన్నై: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా జీవిస్తున్నారు. భర్త ప్రైవేట్ కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. భార్య ఇంట్లోనే ఉంటున్నది. ప్రతిరోజు భర్త ఉద్యోగానికి వెళ్లి వస్తున్నాడు. సమయం ఉన్నప్పుడు భర్త అతని భార్యను బయటకు పిలుచుకుని వెళ్లి వస్తున్నాడు. దంపతులు బయటకు వెళ్లి వచ్చి చూస్తే ఇల్లు లూటీ అయ్యింది. అయితే బంగారు నగలు చోరీ చేసిన దొంగ పారిపోవడానికి ఆ ఇంటి యజమానిని డ్రాప్ అడగడం హాట్ టాపిక్ అయ్యింది.

ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం
చెన్నై సిటీలోని అవడి సమీపంలోనిపప వీరాపురంలోని పుచ్చయ్యమ్మాన్ కోవిల్ వీధిలో జెనిన్ రాజదాస్ (34) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. జెనిన్ కొన్ని సంవత్సరాల క్రితం దివ్యా అనే యువతిని వివాహం చేసుకుని అక్కడే కాపురం ఉంటున్నాడు. జెనిన్ చెన్నైలోని కారు షోరూమ్ లో మంచి ఉద్యోగం చేస్తున్నాడు.

భార్యతో కలిసి బయటకు వెళ్లిన భర్త
షాపులో మటన్ తీసుకురావడానికి ఇంటికి తాళం వేసిన జెనిన్, దివ్యా వెళ్లారు. గంట తరువాత ఇంటికి వెళ్లి చూడగా ఇంటి తాళంతో పాటు బీరువా తాళం పగలగొట్టిన నిందితులు లక్షల రూపాయల విలువైన బంగారు నగలు లూటీ చేసిన విషయం గమనించిన జెనిన్, దివ్యా దంపతులు హడలిపోయారు.

ఇంటి యజమానిని డ్రాప్ అడిగిన దొంగ
వెంటనే ఇంటి నుంచి బయటకు వచ్చిన జెనిన్ బైక్ లో పోలీస్ స్టేషన్ కు బయలుదేరాడు. ఆ సందర్బంలో ఓ వ్యక్తి తనకు బైక్ లో డ్రాప్ ఇవ్వాలని చెప్పాడు. జెనిన్ కు అనుమానం వచ్చి అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఆ సందర్బంలో అతను పారిపోవడంతో జెనిన్ గట్టిగా కేకలు వేసి అతన్ని పట్టుకున్నారు.

సినిమా కనపడింది
వాడు ఎవడో కాదు జెనిన్ ఇంటిలో నగలు చోరీ చేసిన దొంగ. అతని జోబులో జెనిన్ భార్య దివ్యా బంగారు నగలు చిక్కాయి. నగలతో పాటు సుమారు 50 నకిలి తాళాలు ఆ దొంగ దగ్గర చిక్కడంతో స్థానికులు ఆదొంగను చికతబాది విద్యుత్ స్థంభానికి కట్టేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎవరి ఇంట్లో చోరీ చేశాడో అదే ఇంటి యజమానికి దొంగ డ్రాప్ అడగడం హాట్ టాపిక్ అయ్యింది.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications