"రివ‌ర్స్ వాట‌ర్‌ఫాల్".. దేశంలోనే ఎక్కడా చూడని అద్భుతం.. చూసి తీరాల్సిందే..!

దేశంలో అనేక జలపాతాలు ఉన్నాయి. పచ్చని ప్రకృతి మధ్య జలపాతాలను తనివితీరా ఆస్వాధించాలని చాలా మంది పర్యాటకులు కోరుకుంటారు. భారత్ లో వాటర్ ఫాల్స్ అనగానే కర్ణాటకలోని జోగ్ జలపాతం, గోవాలోని దూద్ సాగర్, కర్ణాటకలోని కుంచికల్, మేఘాలయాలోని నోహ్కలికై, కేరళలోని అత్తిరపల్లి జలపాతం, ఛత్తీస్ గఢ్ లోని చిత్రకూట్ జలపాతం, తమిళనాడులోని హోగెక్కల్ జలపాతాలు గుర్తుకువస్తాయి. వాటర్ ఫాల్స్ అంటే సాధారణంగా పై నుంచి కిందకు నీళ్లు జాలువారుతుంటాయి. కానీ ఎక్కడా లేని విధంగా నీళ్లు కింద నుంచి పైకి వెళ్తుంటాయి. వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా ఇది అబ్బుర పరిచే నిజం. మరి ఈ రివర్స్ వాటర్ ఫాల్ ఎక్కడ ఉంది..? ఈ పర్యాటక ప్రాంతానికి ఎలా చేరుకోవాలి..?

జలపాతాలు మనల్ని ఎప్పుడూ కనువిందు చేస్తుంటాయి. వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉన్నా చూసేందుకు పర్యటకులు అధిక సంఖ్యలో వెళ్తుంటారు. ఈ జలపాతాల దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. ఆ అందమైన దృశ్యాలను కెమెరాల్లో బంధించి ప్రకృతి ఒడిలో పులకించిపోతుంటారు. అయితే ఈ వాటర్ ఫాల్ మిగతా జలాల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. అదే రివర్స్ వాటర్ ఫాల్. ఈ వాటర్ ఫాల్ మహారాష్ట్రలోని నానేఘాట్ కొండల్లో ఉంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ జలపాతం పర్యాటకులను కనువిందు చేస్తోంది.

ఈ రివర్స్ వాటర్ ఫాల్ ఓ భారీ కొండ అంచు భాగం నుంచి కిందకు ప్రవహిస్తుంది. వర్షాకాలంలో కింద ఉన్న మైదానాల నుంచి వచ్చే అత్యంత శక్తివంతమైన గాలులు ఈ కొండను బలంగా ఢీ కొట్టినప్పుడు, ఆ గాలి పక్కకు వెళ్లే దారి లేక కొండ అంచు నుంచి చాలా వేగంగా పైకి దూసుకుపోతుంది. నీరు కిందకు లాగే గ్రావిటేషనల్ ఫోర్స్ కంటే పైకి నెట్టే గాలి వేగం చాలా ఎక్కువగా ఉండటం కారణంగా నీరు కిందకు పడకుండా వెనక్కి, పైకి ఎగిసిపడుతుంది అని నిపుణులు పేర్కొంటున్నారు.

ReverseWaterfall spectacular sight Naneghat hills Maharashtra How do you reach tourist destination

ఈ అరుదైన దృశ్యాన్ని చూడాలంటే మహారాష్ట్రలోని నానేఘాట్ కు చేరుకోవాలి. హైదరాబాద్ నుంచి ఈ ప్రాంతానికి దాదాపు 620 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడకు చేరుకోవాలంటే షోలాపూర్, పుణె మీదుగా సుమారు 12 గంటల పాటు ప్రయాణించాలి. రైలులో అయితే కల్యాణ్ జంక్షన్ లేదా పుణె జంక్షన్ వద్ద దిగి అక్కడి నుంచి ట్యాక్సీలో వైశాఖరే గ్రామానికి చేరుకోవాలి. ఇక ఈ ప్రాంతాన్ని సందర్శించాలంటే జూలై నుంచి సెప్టెంబర్ వరకు అత్యంత అనుకూలమైన సమయంగా భావించాలి. ఈ సమయంలోనే రివర్స్ వాటర్ ఫాల్ మరింత అద్భుతంగా ఉంటుంది. మీరూ ఓ సారి ఈ ప్రకృతి రమణీయమైన ప్రదేశాన్ని సందర్శించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+