రివాల్వర్ రాణికి ప్రియుడితో పెళ్లి: అసలేం జరిగిందంటే?, ప్రేమికుల కోసం స్వచ్ఛంద సంస్థ!
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బందా ప్రాంతంలో పెళ్లి పీటలపై ఉన్న వరుడికి తుపాకీ పెట్టి తీసుకెళ్లిన రివాల్వర్ రాణి ప్రేమ కథ సుఖాంతంగా ముగిసింది. మూడు ముళ్ల బంధంతో ఒక్కటవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బందా ప్రాంతంలో పెళ్లి పీటలపై ఉన్న వరుడికి తుపాకీ పెట్టి తీసుకెళ్లిన రివాల్వర్ రాణి ప్రేమ కథ సుఖాంతంగా ముగిసింది. మూడు ముళ్ల బంధంతో ఒక్కటవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్న అశోక్ యాదవ్‌ను మే15వ తేదీని పెళ్లీ పీటలపై నుంచి తుపాకీతో బెదిరించి తీసుకెళ్లిన వర్షా అనే యువతి రివాల్వర్ రాణిగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అప్పుడు ఈ వార్త సంచలనంగా మారింది.

కాగా, ఈ కేసులో అరెస్టైన అశోక్ యాదవ్ గత ఆదివారం జైలు నుంచి విడుదలయ్యారు. ఈ క్రమంలో అశోక్ యాదవ్.. వర్షాను వివాహమాడాడు. ఈ పెళ్లి వేడుకకు కుటుంబసభ్యులు, దగ్గర బంధువులు మాత్రమే హాజరయ్యారు. మాతా చాపురా దేవాలయంలో వీరి పెళ్లి వేడుక జరిగింది.
కాగా, వర్షా, అశోక్‌ల వివాహానికి శివసేన రాష్ట్ర అధ్యక్షుడు రతన్ బ్రహ్మచారి ఏర్పాట్లు చేయడం గమనార్హం. అంతేగాక, ప్రేమికులను కలిపేందుకు వీలుగా రివాల్వర్ రాణి పేరిట ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు రతన్ తెలిపారు.
రివాల్వర్ రాణిగా వర్షా ఇలా అయ్యారు..
తనను ప్రేమ పేరుతో మోసం చేసి మరో యువతిని పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి తుపాకీతో పెళ్లి మండపానికి వెళ్లి వర్షా హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. ఆ పెళ్లి కొడుకు నుదుటిపై తుపాకీ పెట్టి అతనిని కిడ్నాప్ చేసిన మాజీ ప్రియురాలిని ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బందా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
ఇలా ఎందుకు చేశావని ఆమెను పోలీసులు ప్రశ్నించగా.. తాను పెళ్లి మండపానికి తుపాకీతో వెళ్లలేదని, అదంతా అవాస్తవమని కొట్టిపారేస్తోంది. పైగా పెళ్లి కొడుకును తాను కిడ్నాప్ చేయలేదని చెప్పింది. ఆమెపై ఉన్న ప్రేమతో పెళ్లి కొడుకే తీసుకెళ్లాడని చెప్పింది. పైగా ఈ పెళ్లి అశోక్‌కు ఇష్టం లేదని, అశోక్ తనను ప్రేమిస్తున్నట్లు తెలిసి కూడా కావాలనే బలవంతంగా అతనికి వేరే అమ్మాయితో పెళ్లి చేస్తున్నారని చెప్పుకొచ్చింది.
తామిద్దరం గాఢంగా ప్రేమించుకున్నామని, ఎనిమిదేళ్లుగా పరిచయస్తులమని ఆమె చెప్పింది. వర్షా చెప్పిన సమాధానంతో పోలీసులు కంగు తిన్నారు. ఆమె గన్‌తో వెళ్లి బెదిరించినట్లు పక్కా ఆధారాలు ఉండటంతో పోలీసులు ఆమె చెబుతుందంతా అబద్ధమని తేల్చారు. ఇప్పుడు ఈ రివాల్వర్ రాణితోనే అశోక్ వివాహం కావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.












Click it and Unblock the Notifications