ఈవీఎంల భద్రత: ఉల్లంఘిస్తే కాల్చిపారేయమని కలెక్టర్ ఆర్డర్, కలకలం

భోపాల్: ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూంలోకి నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా ప్రవేశించాలని చూస్తే కాల్చివేయాలని మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లా కలెక్టర్ సూచించినట్లుగా ఉన్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. దీనిపై మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి వివరణ కోరారు. ఆ వీడియోలో ఉన్నదాని ప్రకారం ఆమె గది బయట ఉన్న సెక్యూరిటీకి ఈ ఆదేశాలు ఇచ్చింది. ఇది వివాదాస్పదంగా మారింది.

గత నెల 28వ తేదీన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు ముగిశాక ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలలో భద్రపరిచారు. ఈవీఎంల భద్రతపై కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అదే సమయంలో ఈ వీడియో బయటకు వచ్చింది.

ఈ వీడియో ప్రకారం.. రేవా జిల్లా కలెక్టర్ ప్రీతి మైథిలి అక్కడి సిబ్బందికి సూచనలు చేస్తూ కనిపించారు. ఎన్నికల సమయంలో జిల్లా కలెక్టర్లు రిటర్నింగ్ అధికారులుగా ఉంటారు. ఆ జిల్లా ఎన్నికల ప్రక్రియను వారే పరిశీలిస్తారు.

Rewa Collector Allegedly Gave Shooting Orders To EVM Strong Room Security

ఈ నేపథ్యంలో అభ్యర్థులతో కలిసి స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఉన్న భద్రతను కలెక్టర్ పరిశీలించారు. ఈ సమయంలో ఈ వీడియో తీసినట్లుగా ఉంది. తన కెరీర్‌ను ఇబ్బందుల్లో పెట్టుకోనని, మీరు అతడిని నమ్మండి అంటూ సెక్యూరిటీ వైపు తిరిగి.. నీ మాట వినకుండా, నిబంధనలను ఉల్లంఘించిన వారిని కాల్చివెయ్ అని అందులో ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఈ అంశంపై నివేదిక కోరామని, భారత ఎన్నికల సంఘానికి పంపిస్తామని ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+