బిచ్చగాడే గానీ బిగ్ షాట్: సొంత ఫ్లాట్స్

ముంబై: అతను రోజుకు 7 గంటల నుండి 8 గంటల పాటు ముంబై నగరంలో రద్దీగా ఉన్న ప్రాంతాలలో యాచన సాగిస్తుంటాడు. గత 30 సంవత్సరాల నుండి ఇతని వృత్తి ఇదే. గత 30 సంవత్సరాల నుండి కుటుంబ సభ్యులను ఇతనే పోషిస్తున్నాడు.

రూ. కోట్ల విలువైన ఆస్తులు సంపాదించాడు. ఇంత సంపాదన చేసిన ఇతని పేరు భరత్ జైన్ (49). అయితే ఇప్పటికి ఇతను యాచన సాగిస్తున్నాడు. ఉదయం నిద్రలేచిన తరువాత ముంబై నగరంలో రద్దీగా ఉండే వీధుల్లో తిరుగుతుంటాడు.

ఇతను రోజుకు రూ. 2 వేల నుండి రూ. 3 వేలు కలెక్షన్ లు సంపాధిస్తున్నాడు. ముంబై నగరంలో శ్రీమంతులు నివాసం ఉండే పరేల్ ప్రాంతంలో రెండు ఖరీదైన ప్లాట్లు సంపాధించాడు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్లాట్ల విలువ రూ. 80 లక్షలు.

Richest Beggar who even own flats in Mumbai

అయితే ప్రస్తుత మార్కెట్ లో ఆ ప్లాట్ల ధర అంతకు రెండింతలు ఉంది. అదే విధంగా కమర్షియల్ షాప్ కొనుగోలు చేసి జ్యూస్ సెంటర్ కు అద్దెకు ఇచ్చాడు. నెలకు రూ. 10 వేలు అద్దె వస్తుంది. ఇతను కుటుంబ సభ్యులతో కలిసి వేరే ప్రాంతంలో చిన్నపాటి అద్దె ఇంటిలో ఉంటున్నాడు.

ఇతని కుటుంబ సభ్యులు ముంబై నగరంలోని పలు స్కూల్ లు, కాలేజ్ లకు నోట్ బుక్స్, స్టడీ మెటీరియల్ సరఫరా చేస్తుంటారు. ఇతను మాత్రం గత 30 సంవత్సరాల నుండి యాచన సాగిస్తున్నాడు. ప్రతి నెల ఇతను రూ. 75 వేలకు తగ్గకుండా సంపాధిస్తున్నాడని వెలుగు చూసింది. మీడియాలో భరత్ జైన్ హాట్ టాఫిక్ అయ్యాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+