ఐటీ దాడుల ఎఫెక్ట్: మంత్రి డీకే శివకుమార్ ఆస్తుల విలువ ఎన్ని రూ. వందల కోట్లు అంటే ?

కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివకుమార్ నివాసాలు, కార్యాలయాల్లో దాదాపు 80 మంది ఆదాయపన్ను శాఖ (ఐటీ) అధికారులు సోదాలు చేస్తున్నారు. ఏకకాలంలో 36 ప్రాంతాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చెయ్యడంతో క

బెంగళూరు: కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివకుమార్ నివాసాలు, కార్యాలయాల్లో దాదాపు 80 మంది ఆదాయపన్ను శాఖ (ఐటీ) అధికారులు సోదాలు చేస్తున్నారు. ఏకకాలంలో 36 ప్రాంతాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చెయ్యడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉలిక్కిపడ్డారు.

బెంగళూరు, కనకపుర, రామనగర, మైసూరు, న్యూఢిల్లీలోని డీకే. శివకుమార్ కు చెందిన నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. 2013లో కర్ణాటక శాసనసభ ఎన్నికలు జరిగిన సమయంలో డీకే. శివకుమార్ తన ఆస్తుల వివరాలు ఎన్నికల కమిషన్ కు సమర్పించారు.

Richest minister DK Shivakumar declared assets liabilities

తన మొత్తం ఆస్తుల విలువ రూ. 251 కోట్లు అని ఎన్నికల కమిషన్ కు దృవీకరించారు. అందులో రూ.105 కోట్లు అప్పులు చూపించారు. అప్పులు తీసేస్తే మంత్రి డీకే శివకుమార్ ఆస్తుల విలువ రూ. 145 కోట్లు. కర్ణాటకలో శ్రీమంతులైన మంత్రుల్లో డీకే శివకుమార్ మొదటి స్థానంలో ఉన్నారు.

కర్ణాటకలో శ్రీమంతులైన మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయిన ప్రియకృష్ణ ఆస్తుల విలువ రూ. 900 కోట్లకు పైగా ఉంది. మంత్రులు సంతోష్ లాడ్ కు రూ. 186 కోట్లు, ఆర్.వీ. దేశ్ పాండే కి రూ. 138 కోట్లు, ఎంఆర్. సితారామ్ కు రూ. 136 కోట్లు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రమోద్ మధ్వరాజ్ కు రూ. 105 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+