వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆధార్‌తీర్పు ఎఫెక్ట్: బీఫ్ బ్యాన్‌‌పై కీలక నిర్ణయం వెలువడనుందా?

బీఫ్ బ్యాన్‌పై సుప్రీంలో పిటిషన్ దాఖలురెండు వారాలపాటు విచారణను వాయిదావ్యక్తిగత గోప్యత తీర్పు ప్రభావం ఉంటుందని న్యాయమూర్తుల అభిప్రాయం

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన 24 గంటల్లో మరో కీలకమైన అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.

మహరాష్ట్ర ప్రభుత్వం విధించిన బీఫ్ బ్యాన్‌పై సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ శుక్రవారం నాడు ఓ పిటిషన్ దాఖలు చేశారు. వ్యక్తిగత గోప్యత తీర్పు ప్రభావం బీఫ్ బ్యాన్‌పై ఉండే అవకాశం లేకపోలేదని న్యాయమూర్తులు వ్యాఖ్యానించడం గమనార్హం.

Right to Privacy judgment will affect Maharashtra beef ban, says Supreme Court

ఒక వ్యక్తి ఎలాంటి బట్టలు వేసుకోవాలో, ఏం తినాలో చెప్పే హక్కు ఎవరికీ లేదని గురువారం తీర్పు సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ గో మాంసం తినటంపై ప్రభుత్వం బ్యాన్ విధించడం సరికాదంటూ ఇందిర వాదన విన్పించారు.

వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తులు ఏకే సిక్రీ , ఆశోక్‌భూషణ్‌లు ఇది వ్యక్తిగత గోప్యత, (ప్రాథమిక హక్కు) వర్తిస్తోందని తదుపరి వాదనను రెండు వారాలపాటు వాయిదా వేశారు.

మహరాష్ట్ర ప్రభుత్వం విధించిన బీఫ్ బ్యాన్ ఆదేశాలను గత ఏడాది ముంబై హైకోర్టు తప్పుబట్టి కొట్టేసింది. దీంతో మహరాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించింది.

English summary
The Supreme Court has said that the Right to Privacy judgment will have "some bearing" in matters related to possession of beef in Maharashtra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X