వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రేమికులరోజున ప్రేమజంటలకు హిందూ సంఘం బంపరాఫర్

|
Google Oneindia TeluguNews

ప్రేమికుల రోజు వస్తే చాలు... ప్రేమికులంతా హడలెత్తిపోతారు. మిగతా ఏడాది అంతా ఎంతో స్వేచ్ఛగా విహరించే ప్రేమపక్షులు... ఆ ఒక్కరోజే అంటే ఫిబ్రవరి 14న మాత్రమే బయటకు రావాలంటే జంకుతారు. ఎందుకంటే కొన్ని హిందూ సంఘాలు అది మన సంస్కృతి కాదని చెబుతూ పార్కుల్లో తిరిగి కనపడిన ప్రేమజంటలకు పెళ్లి చేస్తున్నారు. దీంతో ఆ ఒక్కరోజు మాత్రమే ప్రేమపక్షులు పంజరంలో చిలకలా బంధీ అయిపోతున్నారు.

ఇక హిందూ సంఘాలను మాత్రం వాలెంటైన్స్ డే రోజున శపించని ప్రేమజంటలంటూ ఉండరు. వారి కంటకనపడకుండా ఉండేందుకు చాలా ప్రయత్నిస్తారు ప్రేమజంట. ఈ సారి కూడా అదే భయం ప్రేమ జంటలను వెంటాడుతోంది. ఇక ఉత్తర్ ప్రదేశ్‌లోని ఆగ్రాలో మాత్రం ఓ హిందూ సంఘం వాలెంటైన్స్ డేకు స్వాగతంపలుకుతోంది. అయితే ఇక్కడ ట్విస్టు కూడా ఉంది.

Right wing group to welcome Valentines Day with a twist

హిందూ కళ్యాన్ మహాసభ ఆగ్రా యూనిట్ మాత్రం ఓ సరికొత్త ఆఫర్ ప్రకటించింది. హిందూ మతానికి చెందిన వ్యక్తి ఒక ముస్లిం మహిళకు తాళి కట్టి వివాహం చేసుకుంటే వారికి నగదు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. అయితే ఇది ఫిబ్రవరి 14న మాత్రమే జరగాలనే కండిషన్ విధించారు. వాలెంటైన్స్ డే రోజున హిందూ మతానికి చెందిన అమ్మాయిలను కాపాడుతుంటే హిందూ సంఘాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహిస్తున్నారని ధ్వజమెత్తారు హిందూ కళ్యాణ్ మహాసభ కన్వీనర్ సంజయ్ జాట్. కానీ ఈ ఏడాది మాత్రం హిందూ మతానికి చెందిన వ్యక్తి ముస్లిం మతానికి చెందిన యువతికి తాళి కడితే ఆ జంటకు రూ.51వేలు ఇస్తామని స్పష్టం చేశారు.

ఇక ప్రేమికుల రోజున తామెలాంటి హింసకు పాల్పడబోమని స్పష్టం చేసిన సంజయ్... హిందూ మతానికి చెందిన అమ్మాయిలను పరిరక్షించుకునేందుకే ఈ ఆఫర్ ప్రకటించామని వెల్లడించాడు. హిందూ మతానికి చెందిన అమ్మయిలను ఇతర మతాలకు చెందిన పురుషులు మోసం చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు హిందూ కళ్యాణ్ మహాసభ సంస్థ ప్రేమజంటలకు ఆగ్రాలోని ఎర్రకోట వద్ద వివాహాలు కూడా జరిపిస్తామని స్పష్టం చేసింది.

English summary
The right wing group - earning bad name for allegedly harassing and assaulting couples on valentine's day have decided to welcome the occasion with open arms but with a twist.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X