Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరం ప్రారంభం ఎప్పుడంటే..!
అయోధ్య రామమందిరం ప్రారంభ తేదీ వచ్చింది. జనవరి 22, 2023న ప్రధాని నరేంద్ర మోడీ రామ మందిరాన్ని ప్రారంభించనున్నారు. రామమందిర నిర్మాణం రెండేళ్లకు పైగా కొనసాగుతోంది. వచ్చే ఏడాది అయోధ్యలో జరగనున్న ఈ భారీ ప్రారంభోత్సవానికి ప్రధాని, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. ప్రాణ ప్రతిష్ఠకు వారం రోజుల ముందు నుంచే పూజల కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
ప్రస్తుతం అయోధ్యలో రాముడి ఆలయ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆలయ నిర్మాణ పనులు అక్టోబర్ నాటికి పూర్తవుతాయి. అప్పటికి రాముడి గర్భ గుడి సిద్ధమవుతుంది. జనవరి 22న ఈ మహా మందిరంలో రాముడు కొలువై ఉంటాడు. అయోధ్యలోని ఇతర మఠాలు, ఆలయాలు రామ మందిర్ ప్రారంభోత్సవం సందర్భంగా వచ్చే సాధువులు, రామభక్తుల బస, ఆహారం కోసం తమ దేవాలయాలలో పూర్తి ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరికీ వసతి, భోజన ఏర్పాట్లు పూర్తి చేయనున్నారు.

రామ మందిర్ ప్రారంబోత్సవానికి కార్యక్రమానికి వచ్చే భక్తులకు సుమారు నెలరోజుల పాటు ఉచితంగా భోజనం అందించాలని ట్రస్ట్ యోచిస్తోంది. జనవరిలో గర్భగుడిలో రాముడి పట్టాభిషేకం సందర్భంగా ట్రస్ట్ ద్వారా రోజూ 75 వేల నుంచి లక్ష మంది భక్తులకు నెల రోజుల పాటు అన్నదానం చేయనున్నట్లు తెలుస్తోంది. రామ మందిరం ప్రారంభోత్సవం పై యూపీ సీఎం యోగి, ప్రధాని మోదీ భేటీ అయ్యారు.
అయోధ్యలో రామమందిరం కోసం జరుగుతున్న ఏర్పాట్లపై సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీఎం యోగి, ప్రధాని మోదీ మధ్య సమావేశం జరిగింది . ఆలయ ఏర్పాట్లకు సంబంధించి సీఎం యోగి ప్రధాని మోడీకి ప్రెజెంటేషన్ ఇచ్చారు. రామమందిరం మ్యూజియంతో సహా అయోధ్య అభివృద్ధి, రామమందిర ప్రారంభానికి సన్నాహాలు గురించి సమాచారం అందించారు. సీఎం యోగి స్వయంగా నెలకు పలుమార్లు అయోధ్యలో తనిఖీలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications