దిమ్మ తిరిగే నీరవ్ మోడీ సంపద: రింగ్ రూ.10 కోట్లు, వాచీ రూ.1.40 కోట్లు
Recommended Video

ముంబై: మూడు రోజుల పాటు సిబిఐ, ఈడీ నిర్వహించిన సోదాల్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసు నిందితుడు నీరవ్ మోడీకి సంబంధించి దిమ్మ తిరిగే సంపద బయటపడింది. ఈ మేరకు శనివారం జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.
కొత్త AI powered cameraతో OPPO F7, 25 ఎంపీ AI సెల్ఫీ కెమెరాతో..
సిబిఐ, ఈడి అధికారులు మూడు రోజుల పాటు ముంబైలోని సముద్ర మహల్ నివాసంలో సోదాలు నిర్వహించారు. పెద్ద యెత్తున వస్తువులను వారు స్వాధీనం చేసుకున్నారు. అత్యంత విలువైన వస్తువులు వారికి చిక్కాయి.

రింగ్ విలువ ఇదీ...
సిబిఐ, ఈడి అధికారులకు చిక్కిన రింగ్ విలువ పది కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. వాచీ రూ.1.40 కోట్ల విలువ చేస్తుందని అంటున్నారు. ప్రాచీన ఆభరణాలు, అరుదైన పెయింటింగ్స్ కూడా నీరవ్ మోడీ నివాసంలో ఉన్నాయి. వాటి విలువ కొన్ని లక్షల నుంచి కొన్ని కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంటున్నారు.

విలువ దాదాపు రూ.50 కోట్లు
నీరవ్ మోడీ నివాసంలో స్వాధీనం చేసుకున్న వస్తువుల విలుపను లెక్క కట్టే పనిలో సిబిఐ, ఈడి అధికారులు ఉన్నారు. తమకు చిక్కిన వస్తువుల విలువ రూ.50 కోట్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు.

అది నీరవ్ మోడీ నివాసం.
ముంబైలోని సముద్ర మహల్ నీరవ్ మోడీ నివాసం. ఆయన పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను వేల కోట్ల రూపాయలకు ముంచాడనే ఆరోపణలు ఎదుర్కుంటున్నారడు ఈ కేసులో ఆయన మేనమామ మెహుల్ చోక్సీపై, తదితరులపై విచారణ జరుగుతోంది. వారు ఇప్పటికే దేశం విడిచి పారిపోయారు.

ఈడి సోదాలు ఇలా.
నీరవ్ మోడీకి చెందిన 21 ఆస్తులను ఈడీ గత నెలలో సీజ్ చేసింది. వాటిలో ఓ పెంట్‌హౌస్, ఓ ఫామ్ హౌస్ ఉన్నాయి. ఈడీ స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ ర.523 కోట్ల వరకు ఉంటుందని అంచనా. సమన్లు జారీ చేసినప్పటికీ నీరవ్ మోడీ గానీ చోక్సీ గానీ దేశానికి తిరిగి రావడానికి సిద్ధపడడం లేదు.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications