సీఎం గారూ.. బుద్ధి మార్చుకోండి -బూతు వాక్యంతో అమితాబ్ మనవరాలు నవ్యా కౌంటర్ -అమ్మాయిల జీన్స్ వివాదంపై
పీఠమెక్కి పట్టుమని పదిరోజులైనా తిరక్కముందే వరుస వివాదాల్లో కూరుకుపోయారు ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్. మొన్నటికి మొన్న ప్రధాని నరేంద్ర మోదీని శ్రీరాముడితో పోల్చుతూ, జనం పూజలు చేస్తారన్న రావత్ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తగా, ఇప్పుడు మహిళల వస్త్రధారణపై ఆయన వెల్లడించిన అభిప్రాయలు వివాదాస్పదం అయ్యాయి. ఆయనకు.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన మనవరాలు నవ్యా నవేలి నందా ఓ బూతు పదంతో ఘాటుగా కౌంటరిచ్చారు.
ఫ్యాషన్ పేరుతో అమ్మాయిలు చిరిగిన జీన్స్ ధరించడం మంచి పద్ధతి కాదని, భారతీయ సంస్కృతికి అది విఘాతమని, అమ్మాయిలు అలాంటి దుస్తులు ధరించకుండా ఇంట్లోవాళ్లే కట్టడి చేయాలని ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ అన్నారు. ఉత్తరాఖండ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆధ్వర్యంలో బుధవారం డెహ్రాడూన్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.

చిరిగిన జీన్స్ ధరించడం ద్వారా అమ్మాయిలు, మహిళలు ఈ సమాజానికి ఏం సందేశమిస్తున్నారో అర్థం కావడంలేదని, మోకాళ్లును నగ్నంగా చూపడం భారతీయ సంస్కృతి కాదని, ధనవంతుల్లాగా కనబడడానికి తహతహలాడే క్రమంలోనే ఆడ పిల్లలకు ఇలాంటివి నేర్పుతున్నారని, ఆడపిల్లలకు ఇళ్లలోనే సరైన సంస్కృతిని నేర్పిస్తే గనుక వారు ఎంత ఆధునికంగా మారినా, జీవితాల్లో ఎన్నటికీ విఫలం కాబోరని సీఎం రావత్ పేర్కొన్నారు. అయితే..

కేవలం వేసుకునే దుస్తులను బట్టి మహిళల స్థాయిని నిర్ణయించడం నిజంగా శోచనీయమంటూ అమితాబ్ మనవరాలు నవ్యా నవేలి నందా మండిపడ్డారు. 'వాట్ ద ఎఫ్' పదాలను వాడుతూ, ఉత్తరాఖండ్ సీఎం రావత్ ను ఉద్దేశించి.. ''మేం ఏది వేసుకోవాలో చెప్పడానికంటే ముందు మీ మనస్తత్వాన్ని మార్చుకోండి. నిజం చెప్పాలంటే ఇక్కడ షాకింగ్ విషయం అమ్మాయిలు చిరిగిన జీన్స్ ధరించడం కాదు, దాని గురించి మీరు సందేశమివ్వడం'' అని నవ్యా నందా ఫైరయ్యారు. తాను చిరిగిన జీన్స్ ధరించిన ఓ ఫోటోను పోస్టు చేస్తూ .. ''నేను గర్వంగా.. నా రిప్డ్ జీన్స్ ధరిస్తాను'' అని నవ్యా పేర్కొన్నారు. రిప్డ్ జీన్స్ వివాదంపై బిగ్ బీ మనవరాలి కామెంట్లపైన సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
-
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications