• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

#RIPPriyankaReddy: ఇలాంటి దారుణాలు ఇంకెన్నాళ్లు.. మరో నిర్భయ అంటూ దేశవ్యాప్త నిరసన!

|

డాక్టర్ ప్రియాంకారెడ్డి సజీవ దహనం కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పుడు #RIPPriyankaReddy అనే హ్యాష్ ట్యాగ్ దేశవ్యాప్తంగా ట్రెండింగ్ అవుతున్నది. మరో నిర్భయ కేసు అంటూ ప్రియాంకారెడ్డికి శ్రద్దాంజలి ఘటిస్తున్నారు. ఈ దారుణ హత్యను ఖండిస్తూ ప్రియాంకారెడ్డికి దేశవ్యాప్తంగా రాజకీయ, సినీ, సామాన్య ప్రజలు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రియాంకారెడ్డి హత్యపై వ్యక్తమవుతున్న ట్వీట్లు మీ కోసం..

బ్రేకింగ్: ప్రియాంకా రెడ్డి హత్యకేసు చేదించిన పోలీసులు.. నలుగురు మానవ మృగాల అరెస్ట్

తీవ్ర విషాదం

ప్రియాంకారెడ్డి మరణవార్త విషాదానికి గురిచేసింది. ఇంకా దేశంలో మహిళలకు ప్రాణ రక్షణ లేదనే విషయం దారుణం మరోసారి స్పస్టం చేసింది. ఇలాంటి ఘటనలకు ఏ సమాజాన్ని, మతాన్ని నేను వేలెత్తి చూపడం లేదు. కానీ మన రేప్ నిందితులకు మన న్యాయవ్యవస్థ ఎందుకు మరణశిక్ష్ విధించడం లేదు అని ప్రశ్నిస్తున్నాను అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.

సిగ్గుతో తలదించుకొని

ప్రియాంకరెడ్డి రేప్ దారుణాన్ని చూసి మాటల రావడం లేదు. షాక్ గురయ్యాను. సిగ్గుతో తల దించుకొన్నాను. ఆగ్రహంతో కలిగిస్తున్నది. జ్యుడిషియరీ, పోలీసు, ప్రభుత్వాలు, సమాజం అన్నీ ఫెయిల్ అయ్యాయి. మన కూతుళ్లను, సోదరీమణులను, స్నేహితులను రక్షించుకోలేకపోతున్నామనే బాధ వ్యక్తమవుతున్నది. నిర్భయ నుంచి ప్రియాంక వరకు చూస్తే ఓ ఒక్క రేపిస్టుకు మరణ శిక్ష విధించుకోలేకపోతున్నాం. సిగ్గుతో తలదించుకోవాలి అని మరో నెటిజన్ ట్వీట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.

మరణశిక్ష విధించాలి

హైదరాబాద్‌లో ప్రియాంకారెడ్డి దారుణ మానభంగానికి గురైంది. దుండగులు సజీవ దహనం చేశారు. స్కూటీ రిపేర్ చేస్తామని చెప్పి ఆమెపై లైంగిక దాడి చేసి దారుణంగా హతమర్చారు. నిందితులకు మరణ శిక్ష విధించాలి. ఇలాంటి దారుణాలు ఇంకెన్నాళ్లు అంటూ ట్వీట్ చేశారు.

అమ్మాయిల కనిపిస్తే రక్షణ కల్పించకపోయినా

అమ్మాయిల కనిపిస్తే రక్షణ కల్పించకపోయినా

దేశంలో మానభంగాలు సర్వసాధారణమయ్యాయి. పిల్లలు, పెద్దలు, జంతువులు అనే తేడా లేకుండా మృగాళ్లకు బలైవుతున్నారు. ఏ ఒక్క ప్రభుత్వం కూడా చట్టాలను సరిగా అమలు చేయలేకపోతున్నది. సెక్స్ ఎడ్యుకేషన్‌పై అవగాహన కలిగించడంల లేదు. మగవాళ్లకు ఒక వినతి. రోడ్డుమీద అమ్మాయి కనిపిస్తే రక్షించలేకపోయినా సరే.. హానీ చేయకండి అంటూ ట్వీట్ చేశారు.

ఎలాంటి శిక్ష విధించినా..

ఎలాంటి శిక్ష విధించినా..

ఇలాంటి దారుణాన్ని ఊహించలేం. ప్రియాంకరెడ్డి అనే డాక్టర్‌ను కిడ్నాప్ చేసి, రేప్ చేసి సజీవ దహనం చేశారనే వార్త తీవ్రంగా కలిచివేసింది. ఇలాంటి బా...ర్డ్స్‌కు ఎలాంటి శిక్ష విధించినా నష్టం లేదు. విషాదంలో మునిగిన ఫ్యామిలీకి నా సంతాపం. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను.

మనషులమని చెప్పుకొనే నైతికతను..

ఇలాంటి దారుణానికి టార్గెట్ నేనేనా? మహిళలకు రక్షణ కల్పించడంలో సొసైటీ దారుణంగా విఫలమైంది. మనిషిని అనే చెప్పుకోవడానికి నైతిక హక్కను కోల్పోయాం. నాలాంటి వాళ్లు ఇలాంటి దారుణాల్ని చూడాల్సిందేనా? ప్రియాంకారెడ్డి మరణం చాలా దారుణం. దేశంలో మహిళలకు ఇంకా రక్షణ లేదనే విషయం మరోసారి స్పష్టమైంది.

మరణశిక్ష విధించాలి

మరణశిక్ష విధించాలి

డాక్టర్ ప్రియాంకరెడ్డి అనే డాక్టర్ దారుణంగా లైంగికదాడికి గురైంది. షాద్‌నగర్‌లో ఆమెను దుండగులు సజీవంగా దహనం చేశారు. ఈ దారుణానికి కారణమైన వారికి వెంటనే మరణశిక్ష విధించాలి అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు

  Vet Doctor Murder Case Solved, Four People Arrested
  నేపాల్‌లోనే కాదు.. ఇండియాలో కూడా

  నేపాల్‌లోనే కాదు.. ఇండియాలో కూడా

  మహిళల రక్షణ నేపాల్‌లోనే కాదు.. ఇండియాలో కూడా అతిపెద్ద సమస్యగా మారింది. ఓ మహిళ లైంగికదాడికి గురై సజీవదహనానికి గురైన రోజు భారత్‌కు సాక్ష్యంగా నిలిచింది. ప్రియాంక ఆత్మకు శాంతి చేకూరాలని అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.

  మరో నిర్భయ లాంటి నిరసన

  మరో నిర్భయ లాంటి నిరసన

  గ్యాంగ్‌రేప్‌కు గురైన ప్రియాంకరెడ్డి ప్రతిభావంతురాలైన డాక్టర్. దారుణంగా హింసకు గురై సజీవ దహనానికి గురైంది. ప్రియాంకారెడ్డి కుటుంబానికి తక్షణ న్యాయం జరగాలి. నిందితులను వెంటనే అరెస్ట్, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ చేపట్టి ఉరిశిక్ష విధించాలి. లేకపోతే మరో నిర్భయ లాంటి నిరసన దేశవ్యాప్తంగా వ్యక్తం కావొచ్చు.

  English summary
  #RIPPriyankaReddy Trending: Many netizen raised thier voice against Priyanka Reddy murder. They say, India has normalised rape. They're raping children, adults and cows, alike. No govt to properly enforce laws, no sex education. Humble request to all the men that see this, if you see a woman in the street, you don't have to protect her, just don't harm her.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
  X