MLA: ఎమ్మెల్యే రాజు హత్య కేసులో ప్రధాన సాక్షి, బాంబులు, తుపాకులతో హత్య, సీసీటీవీల్లో !
లక్నో/ ప్రయోగ్ రాజ్: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యాడు. ఎమ్మెల్యే అయిన కొన్ని నెలలకే ఎమ్మెల్యేని దారుణంగా చంపేశారు. ఎమ్మెల్యే హత్య కేసులో మాఫియా డాన్, మాజీ ఎంపీ, అతని సోదరులు నిందితులు. ఎమ్మెల్యే హత్య కేసు కోర్టులో విచారణ జరిగింది. కేసు సీబీఐ చేతికి వెళ్లింది. ఎమ్మెల్యే హత్య కేసులో ప్రధాన సాక్షికి ఇద్దరు గన్ మెన్ లను ఇచ్చారు. గన్ మెన్ లతో కారులో వెలుతున్న సాక్షిని అడ్డగించి నడిరోడ్డులో బాంబులు వేసి తుపాకులతో కాల్చి దారుణంగా చంపేశారు. ఈ దాడిలో ఇద్దరు గన్ మెన్ లకు తీవ్రగాయాలై ఐసీయూలో ఉన్నారు.
18 ఏళ్ల క్రితం సిట్టింగ్ ఎమ్మెల్యే దారుణ హత్య
ఉత్తరప్రదేశ్ లో 2004లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అలహాబాద్ పశ్చిమ నియోజక వర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసిన రాజు పాల్ అతని ప్రత్యర్థి ఖాలిద్ అజీమ్ అలియాస్ అశ్రఫ్ ను ఓడించి ఎమ్మెల్యే అయ్యాడు. ఎమ్మెల్యేగా గెలిచిన నాలుగు నెలలకే రాజు పాల్ ను చంపేశారు. 2005 జనవరి 25వ తేదీన సులేమ్ సరాయ్ మార్కెట్ సమీపంలో బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్, అతని ఇద్దరు గన్ మెన్ లు దారుణ హత్యకు గురైనారు. 11 ఏళ్ల పాటు స్థానిక కోర్టులో కేసు విచారణ జరిగింది.

కేసు సీబీఐకి అప్పగించిన సుప్రీం కోర్టు
కేసు విచారణ సక్రమంగా జరగడం లేదని ఆరోపిస్తూ రాజు పాల్ భార్య 2015 ఫిబ్రవరి నెలలో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కేసు సీబీఐకి అప్పగించాలని రాజు పాల్ భార్య సుప్రీం కోర్టుకు మనవి చేశారు. 2016 జనవరి 22వ తేదీన రాజు పాల్ కేసును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి సీబీఐ అధికారులు రాజు పాల్ హత్య కేసు విచారణ చేస్తున్నారు.

హత్య కేసు నిందితులు పవర్ ఫుల్
బీఎస్సీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య కేసులో యూపీ మాజీ ఎంపీ, మాఫియా అతీక్ అహమ్మద్ అతని సోదరుడు ఆశ్రఫ్, అతిక్ ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మాఫియాను అంతం చెయ్యడానికి బుల్డోజర్ పద్దతితో వాళ్లకు కట్టడి చేస్తోంది. 2020 అక్టోబర్ లో అతిక్ కు చెందిన జుల్ఫికర్ లోని అతని ఆస్తులు ధ్వంసం చెయ్యడానికి యోగీ ప్రభుత్వం బుల్డోజర్లు పంపించడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది.

ఇంటి మీద కాల్పులు జరిపిన షార్ప్ షూటర్
బీఎస్సీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య కేసులో ప్రధాన సాక్షి ఉమేష్ పాల్. ప్రత్యర్థుల నుంచి ఉమేష్ పాల్ కు ప్రాణహాని ఉండటంతో అతనికి ప్రభుత్వం ఇద్దరు గన్ మెన్ లను ఇచ్చింది. ప్రయోగ్ రాజ్ లో ఉమేష్ పాల్ నివాసం ఉంటున్నారు. శుక్రవారం వేకువ జామున ఉమేష్ పాల్ ఇంటి మీద తుపాకులతో కాల్పులు జరిపారు. అయితే ఉమేష్ పాల్ మాత్రం తప్పించుకున్నాడు. వెంటనే ఉమేష్ పాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. షార్ప్ షూటర్స్ ఉమేష్ పాల్ ఇంటి మీద దాడి చేశారని ప్రయోగ్ రాజ్ సిటీ పోలీసు కమీషనర్ రమిత్ శర్మా మీడియాకు చెప్పారు.












Click it and Unblock the Notifications