రాజకీయాల్లోకి సూపర్ స్టార్, రజనీకాంత్ అభిమని ఆత్మహత్యాయత్నం, విసిగిపోయాం !
చెన్నై/సేలం: సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ్రప్రవేశంపై ఎలాంటి ప్రకటన చెయ్యలేదని మనస్తాపం చెందిన తమిళనాడులోని సేలం జిల్లాలోని పారైవట్టం ప్రాంతానికి చెందిన రజనీ అభిమాన సంఘం అధ్యక్షుడు ఏళుమలై (42) ఆత్మహత్యాయత్నం చేశాడు.
సేలంలోని ప్రభుత్వ మోహన్ కుమారమగళం మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో ఏళుమలై చికిత్స పోందుతున్నాడు.సేలం అళగాపురం పారైవట్టం ప్రాంతానికి చెందిన ఏళుమలై (42) నాట్టుకొరు నల్లవన్ రజనీ మందరం అభిమాన సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు.

సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టిన రోజు ( డిసెంబర్ 12వ తేదీ) ఆయన పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేస్తారని అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై ఎలాంటి ప్రకటన చెయ్యకపోవడంతో మనస్తాపానికి గురైన ఏళుమలై ఇంటిలో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.
వెంటనే విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు ఏళుమలైని అంబులెన్స్ లో సేలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఏళుమలై కోలుకుంటున్నాడని, ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications