బీజేపీ డౌన్‌ఫాల్: 129 నుంచి 120కి దిగజారిన మెజారిటీ: గెలుపుపై ఆర్జేడీ నేతల్లో ధీమా: 110కి
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా అధికార జనతాదళ్ (యునైటెడ్)-భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి మెజారిటీ మార్క్‌ను అందుకుంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ రాష్ట్రీయ జనతాదళ్ నేతలు గెలుపుపై ఆశలు వదలుకోవడానికి సిద్ధంగా లేరు. ఆర్జేడీ నేతల్లో పార్టీ విజయంపై ధీమా వ్యక్తమౌతోంది. ఇంకా లెక్కించాల్సిన ఓట్లు చాలా ఉన్నాయని, ఆధిక్యత తారుమారవుతుందని ఆశిస్తున్నారు. బిహార్‌లో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయేది తామేననే అంటున్నారు.
లెక్కించాల్సిన ఓట్లు చాలా ఉన్నాయని, స్వల్పంగా ఆధిక్యతను కోల్పోయిన నియోజకవర్గాల్లో మళ్లీ ముందంజలోకి వస్తామని ఆర్జేడీ ఎంపీ మనోజ్ షా అన్నారు. లెక్కించాల్సిన ఓట్లు చాలా ఉన్నాయని, నిర్ణీత సమయంలోగా పూర్తి కాకపోవచ్చంటూ కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు చేసిన ప్రకటనను ఆయన ఉటంకించారు. అనేక నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులు స్వల్ప మెజారిటీతో మాత్రమే వెనుకపడ్డారని, ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి వాళ్లంతా ఆధిక్యతలోకి వస్తారని అన్నారు. తమ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా కొందరు వెనుకంజలో ఉన్నారని, వారికి గెలుపుపై విశ్వాసం ఉందని చెప్పారు.

బిహార్ ప్రజలు మార్పును కోరుకున్నారంటూ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన వివరాలు నిజం కాబోతున్నాయని మనోజ్ ఝా అన్నారు. నితీష్ కుమార్, సుశీల్ కుమార్ మోడీ పరిపాలన పట్ల ప్రజలు విసిగి పోయారని, కొత్త బిహార్ కోసం వారంతా తమపార్టీకి అండగా నిలిచారని చెప్పారు. ఎన్డీఏ కూటమి పార్టీలు 122 స్థానాల్లో ఆధిక్యతను సాధించినంత మాత్రాన దాన్ని గెలుపుగా భావించకూడదని చెప్పారు. స్వల్పంగా మెజారిటీని సాదించారే తప్ప విజయాన్ని అందుకోలేదని అన్నారు. కౌంటింగ్ కొనసాగే కొద్దీ తమ అభ్యర్థులు విజయం సాధిస్తారనే విశ్వాసం తనకు ఉందని చెప్పారు.
Recommended Video
బిహార్‌లో రౌండ్ రౌండ్‌కూ ఫలితాలు తారుమారు అవుతోన్న విషయం తెలిసిందే. ప్రారంభ ఫలితాల్లో వెనుకంజలో ఉన్న జేడీయూ-బీజేపీ అభ్యర్థులు ఒక్కసారిగా ముందుకు దూసుకొచ్చారు. ఆర్జేడీని ఓవర్‌టేక్ చేశారు. 70కి పైగా నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు 500 నుంచి 1000 ఓట్ల తేడాతో మాత్రమే ఆధిక్యతలో కొనసాగుతున్నారు. ఇంకా లెక్కించాల్సిన రౌండ్ల మిగిలి ఉండటంతో ఆర్జేడీ నేతల్లో విజయంపై ధీమా వ్యక్తమౌతోంది. మొదట్లో 129 వరకూ వెళ్లిన బీజేపీ ఆధిక్యత.. క్రమంగా తగ్గుతూ వచ్చింది. 120 వద్ద నిలవడాన్ని దీనికి ఉదాహరణగా చూపిస్తున్నారు.












Click it and Unblock the Notifications