ఆర్ కే నగర్ బరిలో 82 మంది: ఈవీఎం బటన్ ల సంఖ్య 62, ఏం చేద్దాం ?

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్ కే నగర్ ఉప ఎన్నికలు జరుగుతున్న సందర్బంగా ఎన్నికల అధికారులకు ఓ సమస్య ఎదురైయ్యింది. ఆర్ కే నగర ఉప ఎన్నికలు ఏప్రిల్ 12వ తేది నిర్వహించడానికి అధికారులు సిద్దం అయిన విషయం తెలిసిందే.

ఆర్ కే నగర ఉప ఎన్నికల బరిలో ఇప్పటి వరకు 82 మంది నిలిచారు. ఎన్నికల పోలింగ్ నిర్వహించానికి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎంలు) సిద్దం చేశారు. అయితే ఈవీఎంలో ఉన్న బటన్ ల సంఖ్య 63. అందులో ఒకటి నోటా బటన్ ఉంది.

RK Nagar: The number of candidates after scrutiny of nominations is 82.

ఇక ఈవీఎంలో ఉన్నది కేవలం 62 బటన్ లు మాత్రమే. నామినేషన్ పత్రాలు పరిశీలించి అనర్హత కలిగిన అభ్యర్థులను తొలగించాలని ఎన్నికల కమిషన్ అధికారులు పలు ప్రయత్నాలు చేశారు. అయితే అభ్యర్థులు సమర్పించిన నామినేషన్ పత్రాలు అన్ని సక్రమంగా ఉండటంతో అధికారులు తలలుపట్టుకున్నారు.

82 మంది అభ్యర్థుల్లో 11 మంది డమ్మీ అభ్యర్థులు ఉన్నారు. నామినేషన్ పత్రాలు ఉప సంహరించుకోవడానికి మార్చి 27వ తేది వరకు అవకాశం ఉంది. 11 మంది డమ్మీ అభ్యర్థులు వారి నామినేషన్ పత్రాలు ఉపసంహరించుకుంటే 71 మంది ఉప ఎన్నికల బరిలో ఉంటారు.

అయినా ఈవీఎంలో ఉన్న బటన్ ల సంఖ్య 62 ఉండటంతో కొత్త ఎలక్ట్రానిక్ యంత్రాలు తెప్పించి ఎన్నికలు నిర్వహించాలా ? ప్రతి పోలింగ్ కేంద్రంలో రెండు ఈవీఎంలు పెట్టి అభ్యర్థులు అందరికీ అవకాశం కల్పించాలా ? లేక బ్యాలెట్ పేపర్లు ఉపయోగించాలా అని అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Election Commission finds itself in a piquant situation in RK Nagar constituency, election to which is scheduled for April 12. The number of candidates after scrutiny of nominations is 82, which is higher than the permitted 63 candidates in EVMs. One slot will have to be left for the NOTA option.
Please Wait while comments are loading...