దైవదర్శనానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ఏడుగురు మృతి!
హర్యాణాలోని అంబాలా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అక్కడిక్కడే ఏడుగురు మృతిచెందారు. మరో 20మంది తీవ్ర గాయాలపాలయ్యారు. దైవదర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అంబాలా జిల్లాలోని జాతీయ రహదారిపై శుక్రవారం మినీ బస్సును అతివేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొన్న సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు స్పాట్‌లో మృతిచెందారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఒకే కుటుంబానికి చెందిన...
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒకే కుటుంబంలోని వారంతా కలిసి మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్రానికి వెళ్తున్న సమయంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అంబాలా-ఢిల్లీ-జమ్మూ జాతీయ రహదారిపై ఇవాళ (శుక్రవారం) తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. క్షత్తగాత్రుల ఆర్థనాదాలతో ఆ ప్రాంతం భయనకంగా మారిపోరింది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని సమీపంలోని అంబాలా కాంట్ సివిల్ హాస్పిటల్ లో చేర్పించారు. ఘటనకు డ్రైవర్ నిద్రమత్తే కారణమని భావిస్తున్నప్పటికీ పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయనున్నట్లు వెల్లడించారు. ఇటీవల కాలంలో తీర్థయాత్రలకు బయలుదేరుతున్న వారి తరచుగా ప్రమాదాలకు గురవుతుండడంతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఉన్నతాధికారులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications