బీభత్సం: భర్తపై కత్తులతో దాడి, భార్యపై గ్యాంగ్ రేప్

వంటగది కిటికీ గ్రిల్స్ ఊడదీసి దోపిడీ దొంగలు ఇంట్లోకి ప్రవేశించారు. ఇంటి యజమానిని కత్తులతో పొడిచారు. దాంతో అతను స్పృహ తప్పిపడిపోయాడు. వృద్ధుడిని కట్టిపడేశారు. ఇద్దరు పిల్లల్లో ఒకర్ని కత్తితో బెదిరించారు. వృద్ధుడి కోడలిపై అత్యాచారం చేశారు.
గాయపడిన వ్యక్తిని ఆస్పత్రిలో చేర్చారు. అతనికి రెండు శస్త్రచికిత్సలు జరిగాయి. నేరం చేయడానికి వచ్చిన దొంగలు మహిళపై అత్యాచారం చేయడం ఇదే తొలిసారి కావ్చచు. పది వేల రూపాయలు, 150 గ్రాముల బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు.
ఇంటిలోకి ప్రవేశించినవారు నలుగురు కావచ్చునని, మరింత మంది బయట కాపు కాస్తూ ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. వృద్ధుడిని కట్టిపడేసి, బాలుడి మెడపై కత్తి పెట్టి, దంపతుల పడక గదిలోకి ప్రవేశించారు. ఇంటి యజమానిపై కత్తులతో దాడి చేశారు. ఎనిమిది నుంచి తొమ్మిది సార్లు అతన్ని పొడిచారు. అతని తలపై బలమైన వస్తువుతో కొట్టారు. దాంతో అతను స్పృహ తప్పి పడిపోయాడు.
ఆ తర్వాత మహిళను కట్టేశారు. ఇద్దరు దొంగలు లైట్లు ఆర్పేసిపై ఆమెపై అత్యాచారం చేశారు. ముఠా ఇతర సభ్యులు ఇంటిని లూటీ చేశారు. బాధితురాలు ధరించిన ఆభరణాలను కూడా లాక్కుని వెళ్లారు. దాదాపు గంటన్నర సేపు ఇంటిలో బీభత్సం సృష్టించారు.












Click it and Unblock the Notifications