దొంగతనానికి వచ్చి గర్భిణిపై గ్యాంగ్‌రేప్ చేశారు
ముంబై: మహారాష్ట్రలోని పర్భాణి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. దొంగతనానికి వచ్చిన కొందరుడు ఓ గర్భిణిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితులను అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పర్భాణి జిల్లా కుడులపాటి గ్రామంలోని పలు ఇళ్లల్లో మంగళవారం దొంగలు పడ్డారు. వారిని గమనించిన ముగ్గురు గ్రామస్థులను దుండగులు గాయపరిచారు.

అనంతరం ఓ గర్భిణిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దుండగుల దాడిలో గాయపడిన ముగ్గురు గ్రామస్థులు, అత్యాచారానికి గురైన మహిళా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications