ప్రియాంక విజయంపై రాబర్ట్ వాద్రా స్పందన: మనసులో మాట ఇదే!
వయనాడ్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ వాద్రా ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. దాదాపు 4 లక్షలకుపైగా మెజార్టీతో ఆమె గెలిచారు. తాజాగా, ప్రియాంక విజయంపై ఆమె భర్త రాబర్ట్ వాద్రా స్పందించారు. ప్రియాంక కృషిని గుర్తించిన వయనాడ్ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ప్రజల సమస్యలను పార్లమెంటులో వినిపించేందుకు ప్రియాంక శ్రమిస్తుందన్నారు రాబర్ట్ వాద్రా. ఇప్పటిదాకా ప్రియాంక పుస్తకాలు చదవడం, పిల్లల్ని చూసుకోవడంలో బిజీగా ఉన్నారని.. ఇప్పుడు దేశ ప్రజలకు సేవ చేయాలనే ఆశయంతో ఆమె ఎన్నికల బరిలోకి దిగారని తెలిపారు. అంతేగాక, తాను కూడా ప్రజల కోసం శ్రమిస్తూనే ఉంటానని చెప్పారు.

అలాంటప్పుడు పార్లమెంటులో ఉండాల్సిన అవసరం లేదని వాద్రా వ్యాఖ్యానించారు. అయినా, నాకూ అలాంటి సమయం వస్తుందని, ప్రజలు ఏం కోరుకుంటారో అదే జరుగుతుందని రాబర్ట్ వాద్రా తన మనసులోని మాటను బయటపెట్టుకున్నారు. ప్రియాంక గాంధీ వాద్రా.. వయనాడ్ లోక్‌సభ ఉపఎన్నికలో ఎవరూ ఊహించని విజయాన్ని నమోదు చేశారు. తన సోదరుడు రాహుల్ పేరు మీదున్న 3.64 లక్షల మెజార్టీని దాటి 4 లక్షల మెజార్టీని క్రాస్ చేశారు సంచలన విజయాన్ని సాధించారు.
మరోవైపు, మహారాష్ట్ర ఫలితాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని రాబర్ట్ వాద్రా అన్నారు. ప్రజల తీర్పును గౌరవించాలని.. గెలిచిన పార్టీతో కలిసి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని రాబర్ట్ వాద్రా తెలిపారు. జార్ఖండ్ ఫలితాలపై సంతోషంగా ఉందన్నారు. ఈడీ, ఇతర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి అధికార పార్టీకి బీజేపీ ఇబ్బందులు కలిగించిందని వాద్రా ఆరోపించారు.
అయినా, ప్రజలు సరైన నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. కాగా, జార్ఖండ్ రాష్ట్రంలో జేఎంఎం-కాంగ్రెస్(ఇండియా) కూటమి విజయం సాధించగా.. మహారాష్ట్రలో మహాయుతి (ఎన్డీఏ) కూటమి అద్భుత విజయాన్ని నమోదు చేసింది.












Click it and Unblock the Notifications