షాక్: వీడియోలతో హల్‌చల్ చేసిన రోహతక్ సిస్టర్స్ ఫెయిల్, యువకులు పాస్
రోహతక్: హర్యానా రాష్ట్రంలోని రోహతక్‌కు చెందిన అక్కాచెల్లెళ్లు లై డిటెక్ట్ పరీక్షలో ఫెయిలయ్యారు. నవంబర్ నెలలో వారు మీడియాలో వార్తలకు ఎక్కిన విషయం తెలిసిందే. వారికి లై డిటెక్ట్ పరీక్షలు నిర్వహించారని సమాచారం. సమాచారం మేరకు.. రోహతక్ అక్కాచెల్లెళ్లు ఆర్తి, పూజలు ఇందులో ఫెయిలయ్యారు.
అదే సమయంలో షాక్‌కు గురి చేస్తూ.. ఎవరైతే తమను వేధించారని ఆ అక్కాచెల్లెళ్లు ఆరోపించారో.. ఆ ముగ్గురు యువకులు ఇందులో పాస్ అయ్యారు. వారికి ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయంలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్సెస్ లాబోరేటరీ(సీఎఫ్ఎస్ఎల్)లో పరీక్షలు నిర్వహించారు.

దీనిపై అక్కాచెల్లెళ్ల తరఫున లాయర్ మాట్లాడుతూ.. ఈ పరీక్షలు ఆధారం కాదని చెప్పారు. లైటెక్టర్ సమయంలో అక్కాచెల్లెళ్లను అసంబద్ధమైన, అమర్యాదపూర్వకమైన ప్రశ్నలు అడిగారని ఆరోపించారు.
అక్కాచెల్లెళ్లను వేధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుల తరఫు లాయర్ మాట్లాడుతూ.. రోహతక్ అక్కాచెల్లెళ్లు చెప్పేది అబద్దమని నిరూపితమైందన్నారు.
కాగా, తమను లైంగికంగా వేధించారంటూ రోహతక్ అక్కాచెల్లెళ్లు వీడియోలు ఇంటర్నెట్లో అప్ లోడ్ చేసిన విషయం తెలిసిందే. వారి వీడియోలే రావడం, అదే సమయంలో వీడియోలు ఎవరు తీస్తున్నారనే అంశాలు అనుమానాలకు తావిచ్చాయి. దీంతో విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications