Romance: ఎమ్మెల్యే టిక్కెట్, నైటీబ్యూటీ రాసలీలల సీడీ, బెడ్ రూమ్ దెబ్బ, డాక్టర్ పేరులోనే కాము !
చెన్నై/ మదురై: ఆయన ఓ డాక్టర్, రాజకీయాల్లో సత్తాచాటుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. గత శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో మన డాక్టర్ రసికరాజు ఓ గదిలో నైటీ వేసుకుని ఎంట్రీ ఇచ్చిన బ్యూటీతో మస్త్ మజా చేశాడు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో నైటీబ్యూటీ రాసలీలల సీడీ బయటకు రావడం కలకలం రేపింది. ఇదే రసికరాజు ఇప్పుడు మళ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇప్పటికే నైటీబ్యూటీ కేసు కోర్టు వరకు వెళ్లిరావడం, ఆ రసికరాజు ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి టిక్కెట్ సంపాధించుకోవడంతో ఇప్పుడు ఆ పార్టీ అధినేత మింగలేక కక్కలేక సతమతం అవుతున్నాడు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో నైటీబ్యూటీ, ఆ డాక్టర్ రసికరాజు మరోసారి హాట్ టాపిక్ అయ్యారు.

డాక్టర్ పేరులోనే కాము
తమిళనాడులోని పెరియకుళం శాసన సభ నియోజక వర్గం నుంచి అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం (AMMK) పార్టీ నుంచి డాక్టర్ కదిర్ కాము పోటీ చెయ్యడానికి ఆ పార్టీ అధినేత, చెన్నై ఆర్ కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. డాక్టర్ కదిర్ కాము పేరులోనే కాము ఉండటం విశేషం.

చిన్నమ్మ ఫ్యామిలీ ఆశీస్సులు
2019లో తమిళనాడులో జరిగిన శాసన సభ ఎన్నికల సమయంలో డాక్టర్ కదిర్ కాము పెరియకుళం నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యే టిక్కెట్ సంపాధించి పోటీ చేసి విజయం సాధించాలని అనేక పయత్నాలు చేశారు. చిన్నమ్మ వీకే. శశికళ నటరాజ్ తో పాటు ఆమె కుటుంబ సభ్యుల అండదండలు ఉండటంతో డాక్టర్ కదిర్ కాము ఉత్సాహంగా రంగంలోకి దిగారు.

నైటీబ్యూటీతో రొమాన్స్
డాక్టర్ కదిర్ కాము ఓ గదిలో షర్టు తీసేసి బనీన్ తో ఉండటం, అదే సమయంలో నైటీ వేసుకున్న బ్యూటీ ఆ గదిలోకి ఎంట్రీ ఇవ్వడం, తరువాత ఇద్దరూ మస్త్ మజా చేస్తున్న సమయంలో ఓ వీడియో తియ్యడం జరిగిపోయింది. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల సమయంలో డాక్టర్ కదిర్ కాము, నైటీబ్యూటీ రాసలీలల వీడియో విడుదల కావడం అప్పట్లో కలకలం రేపింది.

కేసులు..... బయట తలనొప్పులు
నైటీబ్యూటీ రాసలీలల వీడియో బయటకురావడంతో డాక్టర్ కదిర్ కాముతో పాటు ఆయన వర్గీయులు హడలిపోయారు. ఆ రాసలీలల వీడియోలో ఉన్నది తాను కాదని, ఆ నైటీ వేసుకున్న మహిళ ఎవరో తనకు తెలీదని అప్పట్లో డాక్టర్ కదిర్ కాము నొక్కినొక్కి చెప్పారు. అయితే ఆ నైటీబ్యూటీ సైతం నాజీవితంతో డాక్టర్ కదిర్ కాము చెలగాటం ఆడాడని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించడంతో ఆయనకు తలనొప్పి మొదలైయ్యి ఆ వ్యవహారం పోలీస్ స్టేషన్ తో పాటు కోర్టు వరకు వెళ్లింది.

ఎవరా లేడీ ?, ఏమిటి ఆ కథ
డాక్టర్ కదిర్ కాము, నైటీబ్యూటీ రూమ్ లో ఎంజాయ్ చేసే సమయంలో పక్కాప్లాన్ ప్రకారం ఆ రూమ్ కీహోల్ నుంచి వీడియో తీశారని స్పష్టంగా వెలుగుచూసింది. డాక్టర్ కదిర్ కాము రూమ్ లో నైటీబ్యూటీతో ఎంత సరదాగా గడిపి ఎంజాయ్ చేశాడో ఆ వీడియో విడుదలైన తరువాత అతని దూలతీరిపోయింది. డాక్టర్ కదిర్ కాము ఎంజాయ్ చేసిన ఆ మహిళ ఎవరు ?, నైటీబ్యూటీ కథ ఏమిటి ? అంటూ ఆరోజు నుంచి రకరకాలుగా చర్చ మొదలైయ్యింది.

టైమ్ చూసి దెబ్బ కొట్టారు
నైటీబ్యూటీతో ఎంజాయ్ చేసి రాసలీలల సీడితో తలనొప్పి తెచ్చుకున్న డాక్టర్ కదిర్ కాము ఇప్పుడు జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో AMMK పార్టీ నుంచి పోటీ చెయ్యడానికి టీటీవీ దినకరన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి డాక్టర్ కదిర్ కాము రెఢీ అయ్యారు.

రాసలీలల సీడీ రచ్చ.... హాట్ టాపిక్
నైటీబ్యూటీ రాసలీలల సీడీ వ్యవహారంలో డాక్టర్ కదిర్ కామును రక్షించుకుని అతన్ని గెలిపించుకోవడానికి ఏం చెయ్యాలి అంటూ టీటీవీ దినకరన్ సతమతంఅవుతున్నారని తెలిసింది. రాసలీలల వీడియోను మళ్లీ తెరమీదకు తీసుకురావాలని చిన్నమ్మ వ్యతిరేక వర్గీయులు సిద్ం అయ్యారు. మొత్తం మీద ఐదు సంవత్సరాల క్రితం విడుదలై కలకం రేపిన నైటీబ్యూటీ రాసలీలల సీడీ వ్యవహారం మరోసారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా తెరమీదకు రావడంతో స్థానిక నియోజక వర్గం ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో ? అనే విషయం వేచి చూడాలి.












Click it and Unblock the Notifications