విడాకులు తీసుకున్న మాజీ విశ్వసుందరి యుక్తాముఖి

మాజీ విశ్వసుందరి యుక్తాముఖీకి 2008 నవంబర్‌లో తులితో వివాహం జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజులకు యుక్తాముఖి తన భర్త హింసిస్తున్నాడని ముంబైలోని తన తల్లిదండ్రుల వద్దకు తిరిగి వెళ్లింది. అనంతరం 2012 జులైలో తనను వేధింపులకు గురి చేస్తున్నాడని యుక్తాముఖి తన భర్తపై గృహ హింస కేసు పెట్టింది.
కాగా, 2013 మేలో నాగ్‌పూర్ కోర్టులో తన భార్య నుంచి విడాకులు కావాలని యుక్తముఖి భర్త తులి పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు వారిద్దరి మధ్య మధ్యవర్తిగా రాజీవ్ పాటిల్ అనే న్యాయవాదిని నియమించింది. ఆయన వారిద్దరితో పలుమార్లు చర్చించి, వారు పరస్పర సమ్మతంతో సామరస్య పరిష్కారం తీసుకునేలా సహకరించారు.
జస్టిస్ మృదుల భత్కర్.. వారిద్దరి మధ్య విడిపోవాలని కుదిరిన ఒప్పందాన్ని అంగీకరిస్తూ.. తులిపై దాఖలైన గృహహింస కేసులో ముందస్తు బెయిల్‌ను మంజూరు చేశారు. మరో వైపు తనపై నమోదైన గృహహింస కేసును కొట్టివేయాలని తులి కోర్టుకు విజ్ఞప్తి చేసుకున్నారని ఆయన తరపు న్యాయవాది తెలిపారు. తులి నుంచి ఎలాంటి భరణం తీసుకోకుండానే తన కుమారుడ్ని తన దగ్గరే ఉంచుకోవడానికి యుక్తాముఖి అంగీకరించినట్లు ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications