ఎన్ కౌంటర్ జస్ట్ మిస్: రౌడి స్పాట్ నాగకు బుల్లెట్ రుచి
బెంగళూరు: పోలీసులపై కాల్పులు జరిపి పారిపోవడానికి ప్రయత్నించిన పేరు మోసిన నేరగాడి మీద పోలీసులు కాల్పులు జరిపారు. బుల్లెట్ కాలిలోకి దూసుకు వెళ్లడంతో రౌడిషీటర్ కుప్ప కూలిపోయాడు. వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.
బెంగళూరు నగరంలో రౌడిషీటర్ స్పాట్ నాగ అలియాస్ నాగ నివాసం ఉంటున్నాడు. ఇతను అనేక నేరాలు చేశాడు. ఇతని మీద బెంగళూరు నగరంలోని అనేక పోలీస్ స్టేషన్ లతో పాటు కర్ణాకటలోని పలు పోలీస్ స్టేషన్ లలో రౌడిషీట్ ఓపెన్ అయ్యింది. చాల కాలంగా పోలీసులకు తప్పించుకు తిరుగుతున్నాడు.

బుధవారం రాత్రి పొద్దు పోయిన తరువాత స్పాట్ నాగ పిణ్యా రెండవ స్టేజ్ లోని హెగ్గనహళ్ళి దగ్గర ఉన్నాడని రాజగోపాలనగర పోలీసులకు సమాచారం అందింది. సబ్ ఇన్స్ పెక్టర్ వాసీవుల్లా తన సిబ్బందితో కలిసి స్పాట్ నాగను అరెస్టు చెయ్యడానికి బయలుదేరారు.
పోలీసులను చూసిన నాగ చిక్కిపోతామని భావించి వేటకోడవలి తీసుకుని పోలీసుల మీద దాడి చేశాడు. ఆ సమయంలో సబ్ ఇన్స్ పెక్టర్ వాసీవుల్లా రివాల్వర్ తో కాల్పులు జరిపాడు. బుల్లెట్ స్పాట్ నాగ ఎడమకాలిలోకి దూసుకు వెళ్లడంతో కుప్పకూలిపోయాడు. ఇతని మీద బెంగళూరు నగరంలోని అనేక పోలీస్ స్టేషన్ లలో పలు కేసులు నమోదు అయ్యాయని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications