గాలి 'బెయిల్ డీల్' కేసు: యాదగిరికి బెయిల్ మంజూరు

తదుపరి విచారణ ఆరువారాలకు వాయిదా వేసింది. గతంలో ఇదే కేసులో గాలి, పట్టాభిరామారావు, సోమశేఖర్ రెడ్డి సహా ఆరుగురికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.
గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ డీల్ వ్యవహారంలో కీలక సూత్రధారి. న్యాయమూర్తి పట్టాభిరామారావుతో బెయిల్ ఇప్పించేందుకు గాను రూ. 5 కోట్లు లంచం ఇచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా సస్పెన్షన్‌కు గురై అరెస్టయిన న్యాయమూర్తి పట్టాభి రామారావు అంగీకరించారు. మే 11న గాలికి బెయిల్ మంజూరు కాగా ఇందులోని గుట్టును సిబిఐ రట్టు చేసింది.
ఈ బెయిల్ స్కాంలో అరెస్టయిన నిందితుల విచారణలో నాగమారుతీ శర్మ పేరు కూడా వినిపించింది. ఆయనకు కూడా ముడుపులు ఇవ్వజూపినట్లు నిందితులు తెలపడంతో దర్యాప్తు అధికారులు నాగమారుతీ శర్మ వాంగ్మూలాన్ని నమోదు చేశారు.












Click it and Unblock the Notifications