షాకింగ్: ఆ హీరోయిన్ పోర్న్ బాట వెనుక మాస్టర్‌మైండ్‌గా మరో నటి.. అమాయక యువతుల ట్రాప్

టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించి గ్లామరస్ తారగా గుర్తింపు తెచ్చుకున్న గెహానా వశిష్ఠను ఆదివారం(ఫిబ్రవరి 7) ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోర్న్ వీడియోలను చిత్రీకరిస్తూ,వాటిని వెబ్ ప్లాట్‌ఫామ్స్‌లో అప్‌లోడ్ చేస్తోందన్న ఆరోపణల మేరకు పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో కీలక సూత్రధారిగా రోయా ఖాన్‌ అలియాస్ యాస్మీన్‌ను గుర్తించారు.
మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సోమవారం వీరిని కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

మాస్టర్‌మైండ్ రోయా ఖాన్...

మాస్టర్‌మైండ్ రోయా ఖాన్...

ముంబై కేంద్రంగా ఓ గ్యాంగ్ పోర్న్ బిజినెస్ నిర్వహిస్తున్నట్లు స్థానిక క్రైమ్ బ్రాంచ్ పోలీసుల దృష్టికి వచ్చింది. గతంలో పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించిన రోయా ఖాన్ అలియాస్ యాస్మీన్ ఈ గ్యాంగ్‌లో అసలు సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. ఇదే గ్యాంగ్‌లో నటి గెహానా విశిష్ఠను కూడా గుర్తించిన పోలీసులు... ఆమె కూడా పోర్న్ వీడియోల్లో నటిస్తున్నట్లు నిర్దారించారు. ఇప్పటివరకూ ఆమె 87 పోర్న్ వీడియోలను చిత్రీకరించి తన సొంత వెబ్‌సైట్స్‌లో పోస్టు చేసినట్లు గుర్తించారు.

పోర్న్ ట్రాప్‌...

పోర్న్ ట్రాప్‌...

ఈ నేపథ్యంలో ఆదివారం రంగంలో దిగిన పోలీసులు యాస్మీన్,గెహానాతో పాటు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లుగా అనుమానిస్తున్న మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. గెహానా తన పోర్న్ వీడియోలను వెబ్‌సైట్స్‌లో అప్‌లోడ్ చేసి సబ్‌స్క్రిప్షన్ విధానంలో డబ్బులు సంపాదిస్తున్నట్లుగా వెల్లడించారు. సబ్‌స్క్రిప్షన్ కోసం రూ.2వేలు వసూలు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఇక ఈ గ్యాంగ్‌లో కీలక సూత్రధారి యాస్మీన్ అమాయక యువతులను పోర్న్ ట్రాప్‌లోకి లాగుతున్నట్లు గుర్తించారు.

అమాయకు యువతులను ట్రాప్ చేసి...

అమాయకు యువతులను ట్రాప్ చేసి...

పోలీసులు యాస్మీన్‌ను అరెస్టు చేసిన సమయంలో ఆమె వద్ద పలువురు యువతుల పేరుతో ఉన్న ఒక జాబితాను పోలీసులు గుర్తించారు. ఇందులో చాలామంది బాలీవుడ్‌లో సినీ అవకాశాల కోసం అన్వేషిస్తున్నవారే. వారి బలహీనతను ఆసరాగా చేసుకుని... సినిమాల్లో అవకాశాల పేరుతో వారిని ట్రాప్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తమతో రెండేళ్లు ఒప్పందం కుదుర్చుకుంటే సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని ఆ యువతులను నమ్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆపై బలవంతంగా వారితో పోర్న్ వీడియోల్లో నటింపజేస్తున్నారని... ఎదురుతిరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బెదిరింపులకు దిగుతున్నట్లు చెప్పారు.

అవకాశాలు తగ్గడమే కారణమా...?

అవకాశాలు తగ్గడమే కారణమా...?

ఈ కేసులో అరెస్టయిన నటి గెహానా వశిష్ట అసలు పేరు వందనా తివారీ. సినిమాల్లోకి వచ్చాక తన పేరు మార్చుకుంది. బాలీవుడ్‌లో గంధీ బాత్‌తో పాటు పలు చిత్రాల్లో నటించింది. అంతకుముందు మోడల్‌గా పనిచేసింది. తెలుగులో 'అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి', 'నమస్తే', 'బి.టెక్‌ లవ్‌ స్టోరీ', 'ఐదు' వంటి చిత్రాలలో హీరోయిన్‌గా నటించింది. తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించింది. అయితే కొన్నాళ్లుగా సినీ అవకాశాలు సన్నగిల్లడంతో ఆమె పోర్న్ బాట పట్టినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+