వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సమయస్పూర్తి... విడీయో

|
Google Oneindia TeluguNews

ప్రాణాపాయంలో ఉన్న ఒక మనిషిని కాపాడడం అంటే ఎంతో సమయస్పూర్తి, ధైర్యం ఉండాలి. అలాంటి సమయంలోనే తమ ప్రాణాలకు తెగించి , ప్రమాదంలో ఇతరుల ప్రాణాలను కాపాడుతారు. వారే పలు సంధర్భాల్లో హీరోలుగా నిలబడతారు. సోషల్ మీడీయా వచ్చిన తర్వాత ఇలాంటీ సాహోసోపేతమైన సంఘటనలు ప్రజల్లో విసృతంగా ప్రాచుర్యం పోందుతున్నాయి. దీంతో సహాసం చేసిన వారిపై ప్రంశంసల జల్లు కురుస్తోంది.

రైలు ప్రయాణాలు అంటే కొంత కష్టపడాల్సి ఉంటుంది. రైలు స్టేషన్‌కు చేరుకునే సమయానికి సంబంధిత స్టేషన్‌కు ముందుగానే చేరుకోవాల్సి ఉంటుంది. రైలు వచ్చే సమయానికి స్టేషన్‌కు చేరుకోకపోతే ఆ ప్రయాణికులు చుక్కలు చూసినట్టే.. ఓవైపు టికెట్ కౌంటర్ వద్ద రద్దీ మరోవైపు రైలు పోతుందోనేమో అనే కంగారు వెరసీ ప్రయాణికులు రైలు ఎక్కే సంధర్బంలో పలు ప్రమాదాలకు గురి అవుతున్నారు. దీంతో స్టేషన్లలోనే అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే తమిళనాడులోని కోయంబత్తూరు రైల్వే స్టేషన్‌లో ఓ ప్రయాణికుడు కంగారులో కదులుతున్న రైలు ఎక్కబోయి ప్రమాదవశాత్తు క్రిందపడబోయాడు. రైలు పట్టాల మీద పడేందుకు సిద్దంగా ఉన్నాడు. అదే సందర్భంలో అందరు చూస్తుండగానే ఏవరు ఏం చేయలేని పరిస్థితి నెలకోంది. అయితే ప్రయాణికుడి అదృష్టవశాత్తు ఫ్లాట్ ఫామ్ నుండి ఓ రైల్వే పోలీసు నడుచుకుంటూ వెళుతున్న సందర్భంలో ఈ సంఘటన జరిగింది.

RPF personnel saved a passenger from slipping under a moving train

దీంతో వెంటనే స్పందించిన కానిస్టేబుల్ రైలు లోపలి నుండి బయటపడుతున్న ప్రయాణికున్ని సమయస్పూర్తితో రైలు లోపలికి తోశాడు. దీంతో ప్రమాదం తప్పింది. దీంతో నిండు ప్రాణాన్ని తన సమయ స్పూర్తితో కాపాడిన రైల్వే ఉద్యోగిపై ప్రశంశల వర్షం కురుస్తోంది. దీంతోపాటు వీడీయో కూడ వైరల్ అవుతోంది. కాగా ఈ సంఘటన శనివారం ఉదయం చోటుచేసుకుంది.

English summary
Railway Protection Force (RPF) personnel saved a passenger from slipping under a moving train at Coimbatore railway station
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X