ఒక్క బ్యాగులో 18 పిస్టల్స్.. షాక్ అయిన రైల్వే పోలీసులు
కోల్ కతాలోని హౌరా రైల్వే స్టేషన్ లో తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ బ్యాగులో 18 పిస్టల్స్ కనిపించడంతో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్) సిబ్బంది షాకయ్యారు.
కోల్ కతా: తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ బ్యాగులో 18 పిస్టల్స్ కనిపించడంతో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్) సిబ్బంది షాకయ్యారు. కోల్ కతాలోని హౌరా రైల్వే స్టేషన్ లో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్న ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బందికి అనుమానాస్పదంగా పడి ఉన్న బ్యాగు కనిపించింది. దాన్ని తెరిచి చూసిన పోలీసులు ఉలిక్కిపడ్డారు. బ్యాగు నిండా 9 ఎంఎం పిస్టల్స్ కనిపించాయి. లెక్కబెట్టి చూస్తే మొత్తం 18 ఉన్నాయి.

హౌరా ముఖద్వారంగా భావించే అత్యంత రద్దీగా ఉండే హౌరా రైల్వే స్టేషన్ లో ఉన్నట్లుండి ఇంత పెద్ద మొత్తంలో ఆయుధాలు లభించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. దీనిపై హౌరా స్టేషన్ లో పలువురు వ్యక్తులు, వ్యాపారులను పోలీసులు ప్రశ్నించడం ప్రారంభించారు.
అన్ని పిస్టల్స్ ఉన్న బ్యాగు ఎక్కడి నుంచి వచ్చింది? వాటిని తీసుకొచ్చిన వారు పోలీసులు తనిఖీ చేస్తుండడం గమనించి ఆ బ్యాగును అక్కడే వదిలేసి పలాయనం చిత్తగించారా? ఏదైనా ఘటన కోసమే వాటిని తీసుకొచ్చారా? ఇవి మాత్రమేనా, ఇంకేమైనా ఆయుధాల రవాణా జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications