‘ఆపరేషన్ నన్హే ఫరిష్టే’..1,385 మంది పిల్లలను రక్షించిన ఆర్.పి.ఎఫ్
భారతీయ రైల్వేలలో ప్రయాణీకుల రక్షణ , రైల్వే ఆస్తులు మరియు భద్రతను కాపాడుటలో ప్రత్యేక శ్రద్ధతో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్.పి.ఎఫ్)ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ దక్షిణ మధ్య రైల్వే, ఐజి కమ్ ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమీషనర్ శ్రీమతి అరోమా సింగ్ ఠాకూర్ ఆధ్వర్యంలో రైల్వే ప్రాంతంలో నేర కార్యకలాపాలు సాగిస్తున్న మరియు రైల్వే ఆస్తులు మరియు ప్రయాణీకుల వస్తువులను దొంగిలించే నేరస్థులకు వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేయడమనే ప్రధాన లక్ష్యంతో పని చేస్తోంది. ఆర్.పి.ఎఫ్/దక్షిణ మధ్య రైల్వే 2024 సంవత్సరంలో అనేక కార్యకలాపాలను ప్రారంభించి సాధించిన మెరుగైన సేవల సంక్షిప్త సమాచారం క్రింది విధంగా ఉంది
1."ఆపరేషన్ రైల్ సురక్ష" ద్వారా, ఆర్పి (యుపి) చట్టంలోని నిబంధనల ప్రకారం ఆర్.పి.ఎఫ్ 367 కేసుల్లో 674 మంది నేరస్థులను అరెస్టు చేసి రూ.83,31,184 / - విలువైన రైల్వే ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. దీనితోపాటు ఆర్.పి.ఎఫ్ సురక్షితమైన మరియు సానుకూల ప్రయాణ అనుభవాన్ని సులభతరం చేసే దిశలో భాగంగా , రైల్వే చట్టం కింద ఫుట్‌బోర్డ్‌లపై ప్రయాణించినందుకు, మహిళా& వికలాంగుల కంపార్ట్‌మెంట్‌లలో ప్రయాణించినందుకు, అనధికారికంగా ప్రయాణం చేసినందుకు, తోటి ప్రయాణికులకు అసౌకర్యం కలిగించినందుకుగాను మొత్తం 68,746 కేసులను నమోదుచేసి కోర్టుల ద్వారా మొత్తం రూ.1,30 ,77,885/- జరిమానా వసూలు చేయబడింది.

2."ఆపరేషన్ యాత్రి సురక్ష " కింద ఆర్.పి.ఎఫ్ 460 మంది నేరస్థులను అరెస్టు చేసి జి. ఆర్. పి సమన్వయంతో దొంగతనానికి గురైన రూ.3.17 కోట్ల విలువైన సొత్తును స్వాధీనపర్చుకోవడం జరిగింది. ఈ ఘటనలకు సంబంధించిన వారిపై 500 కేసులు నమోదయ్యాయి
3."ఆపరేషన్ నాన్ హే ఫారిస్టే" కింద, వివిధ కారణాలతో ఇంటి నుండి తప్పిపోయిన/పారిపోయిన పిల్లలను గుర్తించి వారి తల్లి తండ్రులకు అప్పగించడం అనే ఉన్నతమైన కార్యక్రమం ద్వారా 1385 మంది పిల్లలు (240 మంది బాలికలతో సహా) ఆర్.పి.ఎఫ్ ద్వారా రక్షించబడ్డారు.
4.మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా -ఆపరేషన్ ఆహ్ట్ ద్వారా ఆర్.పి.ఎఫ్ 264 మంది మానవ అక్రమరవాణా దారుల బారి నుండి 476 మంది బాలురలను మరియు 15 మంది బాలికలను రక్షించింది.
5.రైల్వేల ద్వారా మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఆర్.పి.ఎఫ్ "ఆపరేషన్ నార్కోస్" కింద 111 కేసుల్లో మొత్తం 127 మంది గంజాయి స్మగ్లర్లను అరెస్టు చేసి రూ 5,02,33,060/- విలువ చేసే 2,311.31 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది .
6." ఆపరేషన్ అమానత్ ": అనే కార్యక్రమం ద్వారా2,576 సందర్భాలలో ప్రయాణికులకు సంబందించిన సుమారు రూ.6,93,48,568/- విలువైన ప్రయాణీకులు పోగొట్టుకున్న వస్తువులను ఆర్.పి.ఎఫ్ సిబ్బంది తిరిగి సేకరించి వాటిని నిజమైన యజమానులకు అప్పగించడం ద్వారా ప్రయాణికుల ముఖాలలో ఆనందాన్ని నింపింది. ఆర్.పి.ఎఫ్ ప్రయాణీకుల భద్రత మరియు శ్రేయస్సు పట్ల వారికున్న అంకిత భావానికి భరోసా ఇస్తుంది. నూతన సంవత్సరం 2025 ప్రారంభంలో ఆర్.పి.ఎఫ్ భారతీయ రైల్వేల సేవకు తనను తాను పునరాకితం చేసుకుంటుంది.
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్ 2024 సంవత్సరంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ విధి నిర్వహణలో ప్రదర్శించించిన అంకితభావానికి మరియు ప్రశంసనీయమైన విజయాలు సాధించినందుకు అభినందించారు. ఈ సమిష్టి కృషి వలన రైల్వే ప్రయాణీకులకు భద్రత మరియు రక్షణను అందించడంలో మరియు విలువైన రైల్వే ఆస్తులను కాపాడడంలో రైల్వే రక్షణ దళం విశేషమైన నిబద్ధతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications