ఆర్ఆర్ నగర్ లో కన్నడ హీరో పోటీ, నటుడు, నోటా ఓట్ల తేడా, నా చెప్పుతో సమానం, వివాదాలు !

బెంగళూరు: బెంగళూరు నగరంలోని రాజరాజేశ్వరినగర్ (ఆర్ఆర్ నగర్ )లో ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కన్నడ హీరో, దర్శకుడు హుచ్చ వెంకట్ అందర్నీ ఆకట్టుకోవడానికి ప్రయత్నించాడు. అయితే ఒక్కసారి కూడా ఆర్ఆర్ నగర్ లో హుచ్చ వెంకట్ ఎన్నికల ప్రచారం చెయ్యలేదు. గురువారం ఆర్ఆర్ నగర్ లో ఎన్నికల కౌంటింగ్ లో హుచ్చ వెంకట్ కు వచ్చిన ఓట్లు, నోటాకు ఎన్ని ఓట్లు వచ్చాయి అని తెలుసుకున్న స్థానిక ఓటర్లు షాక్ కు గురైనారు. నా చెప్పుతో సమానం అంటున్నాడు హీరో హుచ్చ వెంకట్.

ఎమ్మెల్యేకి చాలెంజ్

ఎమ్మెల్యేకి చాలెంజ్

2013లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో ఆర్ఆర్ నగర్ శాసన సభ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ప్రముఖ సినీ నిర్మాత మునిరత్న నాయుడు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మునిరత్న నాయుడిని ఓడించడానికి 2018 శాసన సభ ఎన్నికల్లో ఆర్ఆర్ నగర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని హుచ్చ వెంకట్ చాలెంజ్ చేశారు.

స్యాండిల్ వుడ్ టచ్

స్యాండిల్ వుడ్ టచ్

మునిరత్న నాయకుడు, హుచ్చ వెంకట్ కు స్యాండిల్ వుడ్ తో టచ్ ఉంది. ఇద్దరూ కన్నడ సినీ రంగానికి చెందిన వారే. అయితే నిత్యం వివాదాల్లో ఉండే హుచ్చ వెంకట్ రాజకీయ రంగ ప్రవేశంతో మరింత రచ్చరచ్చ చెయ్యడానికి ప్రయత్నించాడు.

నా చెప్పుతో సమానం

నా చెప్పుతో సమానం

నేను ఇంటి ఇంటికి వచ్చి ప్రచారం చెయ్యనని, నోటుకు ఓటు అమ్ముకునే ఓటర్లు నా చెప్పుతో సమానం అని ఎన్నికలకు ముందు హుచ్చ వెంకట్ మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సందర్బంలో స్థానికుల నుంచి తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం అయ్యింది.

ఎన్నికల్లో చెప్పుల గుర్తు

ఎన్నికల్లో చెప్పుల గుర్తు

ఆర్ఆర్ నగర్ శాసన సభ ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కన్నడ హీరో హుచ్చ వెంకట్ కు ఎన్నికల సంఘం చెప్పుల గుర్తు కేటాయించింది. హుచ్చ వెంకట్ ఎవరి మీదైనా విమర్శలు చేస్తే వాళ్లు నా చెప్పుతో సమానం అనే డైలాగ్ ఎక్కువగా ఉపయోగిస్తుంటాడు. హుచ్చ వెంకట్ కు ఎన్నికల సంఘం చెప్పుల గుర్తు కేటాయించిన సమయంలో ఆర్ఆర్ నగర్ ప్రజలు హీరోకు మంచి గుర్తు ఇచ్చారు అంటూ జోకులు వేసుకున్నారు.

 నటుడి ఓట్లు నోటా ఓట్లకు తేడా

నటుడి ఓట్లు నోటా ఓట్లకు తేడా

గురువారం ఎన్నికల సంఘం ఆర్ఆర్ నగర్ లో ఓట్ల లెక్కింపు పూర్తి చేసి అధికారికంగా ప్రకటించారు. కన్నడ హీరో హుచ్చ వెంకట్ కు 764 ఓట్లు వచ్చాయని ప్రకటించారు. 900కుపైగా నోటాకు ఓట్లు పడ్డాయి. నోటా ఓట్ల కంటే కన్నడ నటుడు హుచ్చ వెంకట్ కు తక్కువ ఓట్లు రావడంతో నవ్వులపాలై డిపాజిట్ కోల్పోయాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+