Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

RRR: ఆంధ్రా-కర్ణాటక బార్డర్ లో దుమ్ములేపడానికి సిద్దం అవుతున్న ఆర్ఆర్ఆర్ టీమ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ సందడి !

బెంగళూరు/హైదరాబాద్: ఆర్ఆర్ఆర్ (RRR Movie) సినిమా విడుదల కోసం ప్రేక్షకులు వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా ఈనెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఎన్నడూ కలవని ఇద్దరు టాప్ హీరోలను ఎస్ఎస్ రాజమౌళి ఒకే తెరమీద ఒకే సినిమాలో చూపిస్తున్నారు. సంచలనాల సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఈ సినిమాను ఏరైంజ్ లో తెరకెక్కించారో అనే విషయం ఆ సినిమా ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. RRR సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్ది మెగా అభిమానుల్లో, నందమూరి అభిమానుల్లో టెన్షన్ ఎక్కువైపోయింది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గిరిజన వీరుడు కొమురం భీమ్ పాత్రలో, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరీ సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. ఇక RRR సినిమాలో టాప్ నటీనటులకు ఏమాత్రం కొదవలేదు. బాహుబలి సినిమా తరువాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న RRR సినిమా దేశవ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో సహ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా మార్చి 25వ తేదీన RRR బొమ్మ పడనుంది.

ఆంధ్రప్రదేశ్-కర్ణాటక సరిహద్దులోని చిక్కబళ్లాపురంలో RRR సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ప్రోగ్రామ్ భారీగా నిర్వహించడానికి పెద్దఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకకు చెందిన రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు చిక్కబళ్లాపురంలో జరగబోయే RRR సినిమా ఈవెంట్ లో పాల్గొంటున్నారని జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సంఘం కర్ణాటక కన్వీనర్ మాణిక్యం అంటున్నారు.

 ఇప్పుడు ఎక్కడ చూసినా RRR టాపిక్..... అదే ట్రెండ్

ఇప్పుడు ఎక్కడ చూసినా RRR టాపిక్..... అదే ట్రెండ్

ఆర్ఆర్ఆర్ (RRR Movie) సినిమా విడుదల కోసం ప్రేక్షకులు వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా ఈనెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఎన్నడూ కలవని ఇద్దరు టాప్ హీరోలను ఒకే తెరమీద చూపిస్తున్న సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ ఉన్న దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఈ సినిమాను ఏరైంజ్ లో తెరకెక్కించారో అనే విషయం ఆ సినిమా ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది.

 వాయిదాల మీద వాయిదాలు

వాయిదాల మీద వాయిదాలు

RRR సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని అన్ని పనులు ముగించుకుని ఎప్పుడో విడుదలకు సిద్దం అయ్యింది. అయితే కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. కరోనా వైరస్ థర్డ్ వేవ్ కు తెరపడటంతో ఆర్ఆర్ఆర్ సినిమా ఏట్టకేలకు ఈనెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

 జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్..... మెగా అభిమానులు

జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్..... మెగా అభిమానులు

RR సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్ది మెగా అభిమానుల్లో, నందమూరి అభిమానుల్లో టెన్షన్ ఎక్కువైపోయింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గిరిజన వీరుడు కొమురం భీమ్ పాత్రలో, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరీ సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. ఇక RRR సినిమాలో టాప్ నటీనటులకు ఏమాత్రం కొదవలేదు. బాహుబలి-1, బాహుబలి-2 సినిమాల తరువాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న RRR సినిమా దేశవ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

 ఆంధ్రప్రదేశ్-కర్ణాటక బార్డర్

ఆంధ్రప్రదేశ్-కర్ణాటక బార్డర్

తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో సహ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా మార్చి 25వ తేదీన RRR బొమ్మ పడనుంది. ఆంధ్రప్రదేశ్-కర్ణాటక సరిహద్దులోని చిక్కబళ్లాపురంలో RRR సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ప్రోగ్రామ్ భారీగా నిర్వహించడానికి పెద్దఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళం, హిందీ బాషల్లో ఆర్ఆర్ఆర్ సినిమా పాన్ ఇండియా సినిమాగా విడుదల అవుతోంది.

 రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు

రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు

తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకకు చెందిన రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు చిక్కబళ్లాపురంలో జరగబోయే RRR సినిమా ఈవెంట్ లో పాల్గొంటున్నారని జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సంఘం కర్ణాటక కన్వీనర్ మాణిక్య అంటున్నారు. చిక్కబళ్లాపురంలో జరగబోమే ఆర్ఆర్ఆర్ సినిమా ఫ్రీరిలీజ్ ఈవెంట్ కు వేలాది నందమూరి అభిమానులు తరలివస్తున్నారని కర్ణాటక ఎన్టీఆర్ అభిమానుల సంఘం కన్వీనర్ మాణిక్యం వన్ ఇండియాకు చెప్పారు.

 సుడిగాలి పర్యటనలో ఎన్టీఆర్ ఫ్యాన్స్

సుడిగాలి పర్యటనలో ఎన్టీఆర్ ఫ్యాన్స్

ఆంధ్రప్రదేశ్- కర్ణాటక సరిహద్దులో జరుగుతున్న RRR సినిమా ఈవెంట్ కు రెండు రాస్ట్రాల ప్రజలతో పాటు తమిళనాడులోని హోసూరు, క్రిష్ణగిరికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరౌతారని మాణిక్యం చెప్పారు. ఇప్పటికే బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలోని చిక్కబళ్లాపురం, కోలారు, చింతామణి, గౌరీబిదనూరు, దోడ్డబళ్లాపుర, మాలూరు, హోస్ కోటే, శిడ్లఘట్ట, ముళబాగిలు, శ్రీనివాసపురం తదితర పట్టణాల్లో ఎన్టీఆర్ అభిమానులతో సమావేశం ఏర్పాటు చేశామని. ఆర్ఆర్ఆర్ సినిమా ఈవెంట్ ను విజయవంతం చెయ్యడానికి నందమూరి అభిమానులు అందరు కలిసి పని చెయ్యాలని నిర్ణయించామని కర్ణాటక ఎన్టీఆర్ అభిమానుల సంఘం కన్వీనర్ మాణిక్యం అన్నారు.

 సమయం లేదు మిత్రమా..... !

సమయం లేదు మిత్రమా..... !

చిక్కబళ్లాపురంలో జరగబోయే ఆర్ఆర్ఆర్ సినిమా ఈవెంట్ ను విజయవంతం చేసే బాధ్యతను నందమూరి అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సంఘం కన్వీనర్ మాణిక్యంకు అప్పగించామని నందమూరి అభిమానుల సంఘం నాయకులు అంటున్నారు. చిక్కబళ్లాపురంలో జరగబోయే ఆర్ఆర్ఆర్ సినిమా ఫంక్షన్ విజయవంతం చెయ్యడానికి బెంగళూరు నగరంతో పాటు కర్ణాటకు చెందిన వందలాది మంది అభిమానులు వారి పనుల్లో వారు బిజీబిజీగా ఉన్నారు.

 కర్ణాటకలోని అన్ని జిల్లాల జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంట్రీ

కర్ణాటకలోని అన్ని జిల్లాల జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంట్రీ

బెంగళూరుకు చెందిన ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకులు మాణిక్యం, సమర, మిలటరి శివ, గౌరీపాళ్య భాస్కర్, ఎన్. విజయ్, ఆనంద్ కుమార్, పద్మనాభనగర్ ు చెందిన బెంగళూరు నందమూరి ఫ్యాన్స్ నాయకురాలు అనూష, గుణ, ఇట్టుమడు కన్నయ్య, నరేష్, చైతన్యా, సుధీర్, హెచ్ఎస్ఆర్ లేఔట్ లో చంద్రబాబు, కిశోర్ బాబు, బార్గవ్, డైరీ సర్కిల్ సమర, కుమార్, శీను, శ్రీరాంపుర సత్యనారాయణ, నరేష్, ప్రేజర్ టౌన్ బాలు, శ్రీరామ్, శేషాధ్రిపురం మధు, పెంచులయ్య, కేఆర్ పురం బార్గవ్, యశ్వంత్, కోలారు కిశోర్, వెంకటేష్, పతి, చిక్కబళ్లాపుర మునిరాజు, శివు, జయపాల్, స్వామి, మాలూరు గుర్వేష్, మునిరత్నం, దోడ్డబళ్లాపురం చందు, కిశోర్, మళబాగిల్ ఎన్టీఆర్ చిన్నా, అల్తాఫ్, శిడ్లఘట్ట నాగనరసింహ, శీను, తమిళనాడులోని హోసూరుకు చెందిన విజయ్, మంజునాథ్, లోకి, చరణ్, చందాపుర మంజునాథ్, యునిరాజుతో సహ ఎన్టీఆర్ అభిమానులు, నందమూరి అభిమానులు కర్ణాటకలోని చిక్కబళ్లాపురంలో జరగబోతున్న ఆర్ఆర్ఆర్ సినిమా ఈవెంట్ కోసం ఎవరికి అప్పగించిన పనులు వారు చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+