'అక్కడ చెత్త పడేస్తే రూ.10వేలు జరిమానా వేయండి'
రహదారి పక్కన చెత్త వేసే వారికి పదివేల రూపాయల జరిమానా విధించాలని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలు జారీ చేసింది.
న్యూఢిల్లీ: రహదారి పక్కన చెత్త వేసే వారికి పదివేల రూపాయల జరిమానా విధించాలని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలు జారీ చేసింది. కాలుష్యం పెరగడానికి చెత్త ఒక ప్రధాన కారణమని ఈ సందర్భంగా ఎన్జీటీ పేర్కొంది.
అందుకే దానిని డంప్‌లో కాకుండా రోడ్ల పైన పడేసే వారికి రూ.10వేలు జరిమానా విధించాలని మున్సిపాలిటీలను ఆదేశించింది.

ఈ క్రమంలో హోటళ్లు, మార్కెట్లు, రెస్టారెంట్‌ల నుంచి వచ్చే చెత్త మొత్తాన్ని కార్పొరేషన్ వారు ఏర్పాటు చేసిన వ్యాన్లలో వేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పింది. చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తీసుకెళ్ల లారీలు కూడా సక్రమంగా ఉండాలని, వాటి నుంచి చెత్త రోడ్డుపై పడకుండా చూసుకోవాలని సూచించింది.












Click it and Unblock the Notifications