నోట్ల రద్దు: నడిరోడ్డుపై, మీడియా ముందు కాంగ్రెస్ పరువు తీసిన మహిళలు

కాంగ్రెస్ పార్టీ చేసిన నిరసనలో పలువురు మహిళలు పాల్గొని ఆందోళన చేశారు. అయితే, తాము నోట్ల రద్దుకు, మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకొని, వెంటనే రివర్స్ అయ్యారు.

బెంగళూరు: కర్నాటకలోని బెళగావిలో పలువురు మహిళలు నడి రోడ్డు పైన, మీడియా ముందు కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు. ఈ సంఘటన బుధవారం నాడు జరిగింది. తాము డబ్బులు తీసుకొని నిరసన తెలిపేందుకు వచ్చామని మీడియా ముందు చెప్పి కాంగ్రెస్ నేతలను గుక్క తిప్పుకోకుండా చేశారు.

కాంగ్రెస్ పార్టీ చేసిన నిరసనలో పలువురు మహిళలు పాల్గొని ఆందోళన చేశారు. అయితే, తాము నోట్ల రద్దుకు, మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకొని, వెంటనే రివర్స్ అయ్యారు. తాము అద్దెకు వచ్చిన వారమని చెప్పేశారు.

Rs 100 to criticise Modi- How women protestors exposed the Congress

ఈ సమయంలో, ఆందోళనలో పాల్గొన్న వారిలో పలువురు కాంగ్రెస్ పార్టీ లీడర్లు చాలామంది ఉన్నారు. అందులో వర్కింగ్ ప్రెసిడెంట్ దినేష్ గుండు రావు, మహిళా వింగ్ అధ్యక్షురాలు లక్ష్మి హెబ్బాల్కర్ తదితరులు ఉన్నారు.

బెళగావిలో ఓచోట పదుల సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నోట్ల రద్దు పైన నిరసన తెలపాలనుకున్నారు. వారు దగ్గరలోని స్లమ్ ఏరియాలో నుంచి వందలాది మంది మహిళలను కిరాయికి తీసుకు వచ్చారని తెలుస్తోంది. వీరికి ఒక్కొక్కరికి రూ.100 ఇస్తామని నాయకులు హామీ ఇచ్చారని కూడా తెలుస్తోంది.

అయితే, ఆ ఆందోళన ఎందుకోసమో వారికి తెలియదు. కాంగ్రెస్ నాయకులు, కిరాయికి వచ్చిన మహిళలు ఆందోళన చేపట్టారు.

Rs 100 to criticise Modi- How women protestors exposed the Congress

ఆ కిరాయికి వచ్చిన మహిళలకు ఆందోళన ఎందుకో తెలిసింది. మోడీకి, నోట్ల రద్దుకు వ్యతిరేకంగా నినాదాలు చేయాలని నాయకులు చెప్పారు. దీంతో వారు అందుకు నిరాకరించారని తెలుస్తోంది.

'నోట్ల రద్దు విషయంలో మేం ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయానికి మద్దతిస్తున్నాం. అలాంటప్పుడు ఆయనకు వ్యతిరేకంగా మేం ఎందుకు నినాదాలు ఇవ్వాలి' అని ఓ మహిళ టీవీ ఛానల్ ఎదుటే ప్రశ్నించి కాంగ్రెస్ నేతలకు షాకిచ్చారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు దాని నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేశారని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మహిళా వింగ్ అధ్యక్షురాలు లక్ష్మి హెబ్బాల్కర్ మాట్లాడుతూ.. సదరు మహిళ దేని గురించి మాట్లాడుతుందో అర్థం కావడం లేదన్నారు. వారిని తాము తీసుకు రాలేదన్నారు. వారిని ఎవరు తీసుకు వచ్చారో స్థానిక ఎమ్మెల్యేను అడగాలని చెబుతూ ఆమె అక్కడి నుంచి తన కారు వద్దకు వెళ్లిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+