రూ.1000 నోటు తిరిగి ప్రవేశ పెట్టడంపై కేంద్రం స్పష్టత
రూ.1000 నోట్లను తిరిగి ప్రవేశపెట్టే యోచనలేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. చిల్లర సమస్యలను తొలగించేందుకు ఇటీవల కొత్తగా రూ.200 నోట్లను రిజర్వు బ్యాంకు చెలామణీలోకి తెచ్చిన విషయం
న్యూఢిల్లీ: రూ.1000 నోట్లను తిరిగి ప్రవేశపెట్టే యోచనలేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. చిల్లర సమస్యలను తొలగించేందుకు ఇటీవల కొత్తగా రూ.200 నోట్లను రిజర్వు బ్యాంకు చెలామణీలోకి తెచ్చిన విషయం తెలిసిందే.
అంతకుముందు కొత్త రూ.50 నోట్లను కూడా ఆర్బీఐ తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో మళ్లీ రూ.1000 నోట్లను కూడా ప్రభుత్వం ప్రవేశపెడుతుందని ప్రచారం సాగింది.

దీనిపై కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ స్పందించారు. రూ.1000 నోట్లు తిరిగి ప్రవేశ పెడతారనే ప్రచారాన్ని కొట్టిపారేశారు.












Click it and Unblock the Notifications