బాప్‌రే : మోడీ విదేశీ పర్యటనలకు సంబంధించిన విమాన ఖర్చులు ఎంతో తెలుసా..?
ఢిల్లీ: ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోడీ విమాన ఖర్చులు తెలిస్తే నోరెల్లబెట్టాల్సిందే. విదేశాలకు మోడీ వెళ్లిన సమయంలో ఆయన విమాన ఖర్చులను కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి వీకే సింగ్ రాజ్యసభలో వెల్లడించారు. 2014లో జూన్‌లో ప్రధానిగా మోడీ బాధ్యతలు స్వీకరించారు. ఇక అప్పటి నుంచి తను చేసిన చివరి విదేశీ పర్యటనకు సంబంధించి ఫ్లైట్ చార్జెస్ అంటే చార్టర్డ్ ఫ్లైట్లు, మెయింటెనెన్స్, హాట్‌లైన్ సదుపాయం వీటన్నిటికీ అయిన ఖర్చు అక్షరాల రూ. 2,021 కోట్లు అని మంత్రి వీకే సింగ్ సభకు తెలిపారు.

మోడీ విదేశీ పర్యటనలతో దేశంలో పెరిగి ఎఫ్‌డీఐలు
సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ మోడీ పర్యటించిన దేశాల పేర్లు కూడా సభకు చెప్పారు. భారత్‌లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎక్కువగా వచ్చిన దేశాల్లోనే ప్రధాని పర్యటించడం విశేషం. 2014లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 30,930.5 మిలియన్ అమెరికన్ డాలర్లు ఉండగా మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2017 సంవత్సరం నాటికి ఎఫ్‌డీఐలు 43478.27 మిలియన్ అమెరికన్ డాలర్లకు పెరిగాయని మంత్రి వివరించారు.

మోడీ మన్మోహన్ వర్సెస్ మోడీ విమాన ఖర్చులు
ఇక మోడీ కంటే ముందు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన విమాన ఖర్చులను కూడా సభకు తెలిపారు మంత్రి వీకే సింగ్. మన్మోహన్ ప్రయాణించిన చార్టర్డ్ ఫ్లైట్, మెయింటెనెన్స్, హాట్‌లైన్ సదుపాయాలకు అయిన ఖర్చు రూ.1,346 కోట్లు. అయితే ఇది 2009-10, 2013-14 సంవత్సరానికి చెందిన వివరాలని వీకే సింగ్ వెల్లడించారు. మన్మోహన్ సింగ్ అధికార పర్యటనల వివరాలపై సభ్యులు అడిగిన ప్రశ్నకు వీకే సింగ్ వివరణ ఇచ్చారు.
ప్రధాని నరేంద్ర మోడీ విమానం మెయింటెనెన్స్ కోసం రూ. 1583.18 కోట్లు ఖర్చు కాగా ఛార్టర్డ్ ఫ్లైట్ ఖర్చులు రూ. 429.25 కోట్లు ఖర్చు అయినట్లు సభకు తెలిపారు. ఇది జూన్ 15,2014 నుంచి డిసెంబరు 3, 2018 వరకు ఉన్న సమాచారం అని సభకు తెలిపారు వీకేసింగ్.ఇక హాట్‌లైన్ సదుపాయాల కోసం అయిన ఖర్చు రూ. 9.11 కోట్లు అని వివరించారు.

మోడీ విమాన ఖర్చులు ఇవే...!
ఇక ప్రధాని నరేంద్ర మోడీ 48 విదేశీ పర్యటనలు చేయగా అందులో 55 దేశాలను సందర్శించారని వెల్లడించారు. కొన్ని సార్లు ఒకే దేశానికి పలుమార్లు వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. అయితే వీకే సింగ్ చెప్పిన లెక్కల్లో 2017-18,2018-19కి సంబంధించి హాట్‌లైన్ సదుపాయాల ఖర్చు ప్రస్తావన లేకపోవడం విశేషం. ఇక ఓవర్సీస్ గమ్యస్థానాలకు అయిన చార్టర్డ్ ఫ్లైట్ ఖర్చులు అంటే 2014-15 రూ. 93.76 కోట్లు కాగా, 2015-16లో 117.89 కోట్లుగా తేలిందన్నారు. 2016-17లో రూ.76.27 కోట్లు ఉండగా 2017-18కి ఖర్చుల వివరాలు 99.32 కోట్లుగా ఉందన్నారు. ఇక 2018-19 డిసెంబర్ 3 వరకు ప్రధాని మోడీ చార్టర్డ్ ఫ్లైట్ ఖర్చులు రూ. 42.01 కోట్లు అని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి వీకే సింగ్.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications