హోమ్ లోన్ పై రూ.2.5 లక్షల సబ్సిడీ, 20 ఏళ్ల వరకు గడువు
2022 కల్లా దేశంలో అందరికీ ఇళ్లు ఉండాలనేది కేంద్ర ప్రభుత్వం ఆకాంక్ష. అందుకే గృహరుణాలు తీసుకునే వారిని ప్రోత్సహించాలని నిర్ణయించింది.
న్యూఢిల్లీ: 2022 కల్లా దేశంలో అందరికీ ఇళ్లు ఉండాలనేది కేంద్ర ప్రభుత్వం ఆకాంక్ష. అందుకే గృహరుణాలు తీసుకునే వారిని ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఏడాదికి 18 లక్షల వరకు జీతం ఉండి.. తొలిసారిగా ఓ ఇల్లు కొనుక్కోవాలని అనుకునే వారికి హోమ్ లోన్ లో రూ.2.5 లక్షల వరకు భారం తగ్గనుంది.
ఇలాంటి గృహ రుణాల వడ్డీపై కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వనుంది. గతంలో ఈ ఏడాది జీతం నిబంధన రూ.6 లక్షల వరకు ఉండేది. ఇప్పుడు దీనిని రూ.18 లక్షలకు పెంచారు. రుణ గడువు పరిమితిని కూడా ప్రభుత్వం 15 ఏళ్ల నుంచి 20 ఏళ్లకు పెంచింది.
గత ఏడాది డిసెంబర్ 31న ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కొత్తగా రెండు సబ్బిడీ పథకాలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఆ పథకాల వివరాలను ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
ఏడాది ఆదాయాన్ని బట్టి ఈ సబ్బిడీ రేట్లలో తేడా ఉంటుంది. రూ.6 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి.. ఇంటి కోసం తీసుకున్న రుణంలో రూ.6 లక్షల మొత్తానికి 6.5 శాతం వడ్డీని కేంద్రం భరిస్తుంది.
అంటే.. రుణం ఎంత మొత్తం తీసుకున్నా అందులో రూ.6 లక్షలకు మాత్రమే 6.5 శాతం వడ్డీని కేంద్రం చెల్లిస్తుంది. ఉదాహరణకు 9 శాతం వడ్డీకి రూ.10 లక్షల గృహరుణం తీసుకుంటే అందులో ఆరు లక్షల రూపాయలకు మీరు చెల్లించాల్సిన వడ్డీ 2.5 శాతమే. ఆరు లక్షలకు పైన ఉన్న రుణానికి మాత్రం 9 శాతం చొప్పున వడ్డీ చెల్లించాలి.

ఇక ఏడాదికి రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్న వారయితే.. వారు తీసుకున్న మొత్తం గృహరుణంలో రూ.9 లక్షలపై 4 శాతం వడ్డీని కేంద్రం సబ్సిడీగా ఇస్తోంది. అలాగే రూ.18 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి మొత్తం గృహ రుణంలో రూ.12 లక్షలకు 3 శాతం వడ్డీని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది.
అంటే.. ఏడాదికి 9 శాతం వడ్డీతో 20 ఏళ్ల పరిమితికి గృహరుణం తీసుకుంటే... ఈ మూడు కేటగిరీల వారికి రూ.2.4 లక్షల వరకు లబ్ధి చేకూరుతుంది. నెలవారీ ఈఎంఐ కూడా సుమారు రూ.2,200 వరకు తగ్గుతుంది. హోమ్ లోన్స్ పై ఉన్న ఆదాయ పన్ను మినహాయింపులకు ఈ సబ్సిడీ అదనం. నేషనల్ హౌసింగ్ బ్యాంక్, హడ్కో ఈ సబ్సిడీ స్కీమ్స్ కు నోడల్ ఏజెన్సీలుగా పని చేస్తాయి.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications