43 కిలోల బంగారం స్వాధీనం.. రూ.21 కోట్లు విలువ.. ఇక్కడే
మణిపూర్‌లో భారీగా బంగారం పట్టుబడింది. ఇంఫాల్‌లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు చేసిన తనిఖీల్లో ఏకంగా రూ.21 కోట్లు విలువ చేసే గోల్డ్ స్వాధీనం చేసుకున్నారు. అదీ మొత్తం 43 కిలోలు ఉంటుందని అధికారులు తెలియజేశారు. బంగారం అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులకు ముందే సమాచారం అందింది. దీంతో తనిఖీలను ముమ్మరం చేశారు.
ఓ కారును ఆపి తనిఖీ చేయగా.. బంగారం అక్రమ రవాణా బయటపడింది. కారులో ఏర్పాటు చేసిన ప్రత్యేక అరల్లో మొత్తం 260 బంగారం బిస్కెట్లను గుర్తించారు. వాటిని కారు నుంచి వెలికి తీసేందుకు చాలా సమయం పట్టింది. 18 గంటల సమయం పట్టడంతో.. అందులో బంగారం ఉందా లేదా అనే అనుమానం కలిగింది. ఇదే వాహనాన్ని గతంలో స్మగ్లింగ్‌కి కూడా వినియోగించినట్లు అధికారులు గుర్తించారు.

మయన్మార్ సరిహద్దుల్లో ఉన్న మణిపూర్‌లో బంగారం అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. గత మూడు నెలల్లో 67 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంట్లో 55 కిలోల బంగారం ఒక్క జూన్ నెలలోనే పట్టుబడడం విశేషం. ఆ క్రమంలోనే ఇవాళ భారీగా బంగారం పట్టుబడింది. అంతర్జాతీయ సరిహద్దు ఉండటం.. కొందరు అక్రమార్కులు బంగారం స్మగ్లింగ్‌ను ఆసరాగా చేసుకున్నారు.
దీంతో యధేచ్చగా స్మగ్లింగ్ జరుగుతుంది. భారీగా బంగారం తరలిస్తున్నారు. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం గుండా కూడా భారీగా బంగారం స్మగ్లింగ్ జరుగుతుంది. రోజు ఎంతో కొంత బంగారం అక్కడ పట్టుబడుతుంది. కానీ మణిపూర్‌లో మాత్రం పెద్ద ఎత్తున బంగారం పట్టుబట్టడం కలకలం రేపుతోంది.
-
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
ఓపెనర్ గా అభిషేక్ స్థానంలో - ఫైనల్ లో భారీ ట్విస్ట్, ఫలించేనా..!! -
India Post GDS Result 2026: పోస్టాఫీస్ జాబ్స్ మెరిట్ లిస్ట్ విడుదల-ఇలా చెక్ చేసుకోండి..! -
ఫైనల్ మ్యాచ్ వర్షం లో కొట్టుకుపోతే, ఛాంపియన్ ఎవరు - ఐసీసీ తాజా రూల్స్..!! -
కోనసీమ వాసుల కల నెరవేర్చే కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్ లో కీలక అడుగు












Click it and Unblock the Notifications