మిథున రాశి, కర్కాటక రాశి మే నెల జాతక ఫలం పూర్తి వివరాలు

గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్నిసార్లు సానుకూల ఫలితాలు, మరికొన్ని సార్లు ప్రతికూల ఫలితాలను కలుగజేస్తుంటాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఎంతో అరుదైన రాజయోగాలను ఏర్పరుస్తుంటాయి. తెలుగులో ఉన్న 12 రాశుల్లో మిథున రాశి, కర్కాటక రాశివారి మే నెల జాతక ఫలం ఎలా ఉందో పూర్తి వివరాలను తెలుసుకుందాం. ఈ ఫలితాలు గ్రహాల కదలికల ఆధారంగా ఉంటాయి. వ్యక్తిగత జాతకంలోని గ్రహ బలాన్ని బట్టి ఈ ఫలితాల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

మిథున రాశి (మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు)

మే నెల మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మంచిది. ధన ప్రవాహం సామాన్యంగా ఉంటుంది. అనవసరపు ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి స్వల్ప లాభాలు రావచ్చు. కొత్తగా ఎవరికీ అప్పు ఇవ్వకుండా ఉంటే చాలు. కార్యాలయంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. తోటి ఉద్యోగులతో చిన్నపాటి విభేదాలు వస్తాయి. వ్యాపారస్తులు నూతన ఒప్పందాలు చేసుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి.

Horoscope Predictions and results for these two signs gemini and cancer for may month

నెల ద్వితీయార్థంలో పరిస్థితులు మెరుగుపడతాయి. కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి మనస్పర్థలు రావచ్చు. మాట విషయంలో సంయమనం పాటించాలి. ఆరోగ్యం పరంగా కంటి సంబంధిత లేదా ఉదర సంబంధిత ఇబ్బందులు ఉండవచ్చు. విద్యార్థులు ఏకాగ్రత పెంచుకోవాలి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారికి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ప్రతి బుధవారం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం లేదా వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం శుభప్రదం.

కర్కాటక రాశి (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)

కర్కాటక రాశి వారికి మే నెల చాలా అనుకూలంగా ఉండబోతోంది. మీరు తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థికంగా ఈ నెల మీకు బాగుంది. కొత్త ఆదాయ మార్గాలు వెతుక్కుంటారు. ఆకస్మిక ధన లాభం కలిగే సూచనలు ఉన్నాయి. స్థిరాస్తి సంబంధిత వ్యవహారాలు మీకు లాభిస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి లేదా స్థానచలనం కలిగే అవకాశం ఉంది. అధికారుల మద్దతు లభిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి లాభాలు ఆశించిన దానికంటే ఎక్కువగా ఉంటాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి సమయం.

ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలున్నాయి. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పాత అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. విద్యార్థులు విద్యలో రాణిస్తారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. సోమవారం శివాభిషేకం చేయడం లేదా శివాలయ సందర్శన చేయడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+