వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.210 కోట్ల ఐజీఎస్టీ నిధులు విడుదల చేయండి: నిర్మలమ్మకు హరీశ్ రావు వినతి

|
Google Oneindia TeluguNews

జీఎస్టీ కౌన్సిల్ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. సమావేశానికి తెలంగాణ రాష్ట్రం నుంచి ఆర్థికమంత్రి హరీశ్ రావు కూడా హాజరయ్యారు. రాష్ట్రానికి రావలసిన ఐజీఎస్టీ నిధులు విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. ఐజీఎస్టీ పరిహారంలో తెలంగాణకు రూ.210 కోట్ల నిధులు రావలసి ఉందని వివరించారు.

తెలంగాణలో జిల్లాల సంఖ్య 10 నుంచి 33కు పెరిగిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఇచ్చే నిధులను 9 జిల్లాలకు కాకుండా హైదరాబాద్ మినహా మిగతా 32 జిల్లాలకు ఇవ్వాలని హరీష్ రావు కోరారు. ఈ నిధులను 2021-22 నుంచి మరో ఐదేళ్లపాటు అందించాలని అడిగారు. బీఆర్జీఎఫ్ నిధులను కూడా సాధ్యమైనంత త్వరగా విడుదల చేయాలన్నారు. 2020-21లో 15వ ఆర్ధిక సంఘం సిఫారసు చేసిన రూ.723 కోట్ల గ్రాంటును కూడా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నిర్మలా సీతారామన్‌కు ఆయన లేఖ అందించారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జీఎస్టీ మండలి 45వ సమావేశం జరుగుతోన్న సంగతి తెలిసిందే.

rs.210 crores igst release, harish rao asked nirmala sitharaman

45వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ తర్వాత తొలిసారిగా ఫిజికల్ మీటింగ్ జరుగుతోంది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన మీటింగ్ జరిగింది. ఈ క్రమంలోనే కరోనా వైరస్‌కు సంబంధించి మందులపై 12 శాతం జీఎస్టీ నుంచి 5 శాతం వరకు తగ్గిస్తున్నామని ప్రకటించారు. ఇక మిగతా మందుల విషయానికి వసతే ఆంఫొటెరిసన 5 శాతం రాయితీ ఉండే దానిని మొత్తానికి తీసివేశారు. టొసిల్ మాబ్ కూడా జీరో చేశారు. రెమిడెసివర్ 12 శాతం నుంచి 5 శాతం చేశారు. హెపరిన్ కూడా 12 నుంచి 5 శాతం చేశారు. పెట్రోల్, డీజిల్ కూడా జీఎస్టీ పరిధిలోకి వచ్చే అంశంపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. ఇప్పుడే విధించబోమని తెలియజేసింది. ఫుడ్ డెలివరీ సంస్థలు జొమాటో, స్విగ్గీకి కూడా 5 శాతం జీఎస్టీ విధించాలనే అంశం డిస్కషన్ వచ్చింది. 5 శాతం జీఎస్టీ విధించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

English summary
rs.210 crores igst release to telangana state finance minister harish rao asked nirmala sitharaman.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X