రూ.28,000 కోట్ల సైబర్ స్కామ్.. ఫ్రీజ్ ఖాతాల వెనుక లాయర్!

దేశవ్యాప్తంగా విస్తరించిన సైబర్ నేరాలు, మనీ లాండరింగ్ నెట్‌వర్క్‌పై ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) భారీ చర్యలు చేపట్టింది. విచారణ ఏజెన్సీలు ఫ్రీజ్ చేసిన సైబర్ నేరగాళ్ల బ్యాంక్ ఖాతాలను లంచాలు ఇచ్చి తిరిగి తెరిపిస్తున్న ముంబైకి చెందిన న్యాయవాది రశేష్ భారత్ కుమార్ ఉపాధ్యాయ అలియాస్ రశేష్ షాను ఈడీ పనాజీ జోనల్ ఆఫీస్ అక్టోబర్ 24, 2026న అరెస్ట్ చేసింది. ముంబై విమానాశ్రయం ద్వారా ఢిల్లీకి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా సీఐఎస్ఎఫ్, కస్టమ్స్ అధికారుల సహాయంతో ఇమిగ్రేషన్ విభాగం ఆయనను అదుపులోకి తీసుకుంది. అనంతరం ఉత్తర గోవాలోని ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచగా.. న్యాయస్థానం ఆయనను అక్టోబర్ 29, 2026 వరకు ఈడీ కస్టడీకి అప్పగించింది.

విజయవాడలో దారుణం: నీళ్ల బాటిల్ కోసం 2 గంటలు హింసించి ప్రాణాలు తీశారు!
విజయవాడలో దారుణం: నీళ్ల బాటిల్ కోసం 2 గంటలు హింసించి ప్రాణాలు తీశారు!

డిజిటల్ అరెస్ట్ పేరిట రూ.2.6 కోట్ల మోసం
గోవా పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈ కేసు విచారణను ప్రారంభించింది. నిందితులు ట్రాయ్, సీబీఐ అధికారులమని చెప్పి డిజిటల్ అరెస్ట్ పేరిట గోవాకు చెందిన ఓ దంపతులను భయభ్రాంతులకు గురిచేశారు. సుప్రీంకోర్టు నకిలీ ఉత్తర్వులను చూపిస్తూ నిరంతరం వీడియో నిఘాలో ఉంచి, తమ ఆధీనంలో ఉన్న సీక్రెట్ సూపర్‌విజన్ ఖాతాలకు రూ.2.6 కోట్లను బదిలీ చేయించుకున్నారు. ఈ అక్రమ సొమ్మును దాదాపు 400 కంటే ఎక్కువ మ్యూల్ బ్యాంక్ ఖాతాల ద్వారా విదేశీ మారక ద్రవ్యం, ట్రావెల్, కమోడిటీ కంపెనీలకు మళ్లించినట్లు దర్యాప్తులో తేలింది.

Rs 28000 Crore Cyber Scam Lawyer Arrested By Enforcement Directorate For Unfreezing Bank Accounts

20 రాష్ట్రాలు.. రూ.28,000 కోట్ల భారీ లావాదేవీలు
ఈ మొత్తం నెట్‌వర్క్‌ను ఫహీమ్ మోయిన్ హుస్సేన్ సయ్యద్, నయీమ్ మోయిన్ సయ్యద్ అనే వ్యక్తులు నకిలీ డమ్మీ డైరెక్టర్ల ద్వారా నియంత్రిస్తున్నట్లు ఈడీ గుర్తించింది. ఈ నెట్ వర్క్ ద్వారా దాదాపు రూ.28,000 కోట్ల విలువైన బ్యాంకింగ్ లావాదేవీలు జరిగాయని, వీటిలో దాదాపు రూ.2,900 కోట్ల నగదును డిపాజిట్ చేశారని సమాచారం. దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నమోదైన 300కి పైగా బాధితుల ఫిర్యాదులు, 160కి పైగా ఎఫ్ఐఆర్‌లతో ఈ బ్యాంక్ ఖాతాలకు సంబంధం ఉందని, దీనివల్ల దాదాపు రూ.400 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని ఈడీ పేర్కొంది.

దక్షిణాది రాష్ట్రాల భద్రత, నేరాల కట్టడికి సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
దక్షిణాది రాష్ట్రాల భద్రత, నేరాల కట్టడికి సీఎం రేవంత్ రెడ్డి పిలుపు

లంచాలు ఇచ్చి బ్యాంక్ ఖాతాల అన్‌ఫ్రీజ్!
ఈ భారీ సైబర్ నెట్‌వర్క్‌లో అరెస్ట్ అయిన లాయర్ రశేష్ ఉపాధ్యాయ కీలక పాత్ర పోషించారు. సైబర్ ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు ఏజెన్సీలు ఫ్రీజ్ చేసిన బ్యాంక్ ఖాతాలను తిరిగి తెరిపించేందుకు ఆయన అధికారులకు నగదు రూపంలో లంచాలు ఇచ్చేవారని ఈడీ వెల్లడించింది. హవాలా మార్గాల ద్వారా లంచం డబ్బును బదిలీ చేసేవారని, ఏజెంట్ల కోసం దాదాపు 100 బ్యాంక్ ఖాతాలను అన్‌ఫ్రీజ్ చేయించినట్లు రశేష్ ఉపాధ్యాయ అంగీకరించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటివరకు ఏడుగురిని అరెస్ట్ చేయగా.. అక్రమ సొమ్ము ఎక్కడెక్కడికి మళ్లిందో తెలుసుకునేందుకు ఈడీ విచారణను వేగవంతం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+