నడి రోడ్డులో రూ. 45 లక్షల రూ. 2,000 నోట్లు
బెంగళూరు చేరుకున్న డోమినిక్ రాయ్ ఇక్కడి లింగరాజపురంలో నివాసం ఉంటున్నాడు. డోమినిక్ రాయ్ భార్య దుబాయ్ లో ఉద్యోగం చేసేది. ఇటీవలే ఆమె బెంగళూరు వచ్చింది.
బెంగళూరు: ఏటీఎంలో డబ్బు నిల్వ చెయ్యడానికి తీసుకు వెలుతున్న సమయంలో నగదుతో ఉన్న వ్యాన్ తో సహ పరారైన డ్రైవర్ కోసం బెంగళూరు పోలీసులు తమిళనాడులో గాలిస్తున్నారు. తమిళనాడుకు చెందిన డోమినిక్ రాయ్ అనే అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇతను నగదుతో సహ పరారైన వ్యాన్ ను బెంగళూరులోనే వదిలేశాడు. గురువారం ఉదయం వసంతనగర్ లోని మౌంట్ కార్మల్ కాలేజ్ సమీపంలో ఆ వ్యాన్ ను పోలీసులు గుర్తించారు. వ్యాన్ తో సహ సెక్యూరిటీ గార్డుకు చెందిన గన్ , రూ. 45 లక్షలు ( అన్నీ రూ. 2,000 నోట్లు) నడి రోడ్డులో వదిలి పెట్టి వెళ్లాడు.
బెంగళూరు చేరుకున్న డోమినిక్ రాయ్ ఇక్కడి లింగరాజపురంలో నివాసం ఉంటున్నాడు. డోమినిక్ రాయ్ భార్య దుబాయ్ లో ఉద్యోగం చేసేది. ఇటీవలే ఆమె బెంగళూరు వచ్చింది. బెంగళూరు చేరుకున్న డోమినిక్ రాయ్ 10 రోజుల క్రితమే సక్యూర్ ట్రాన్సిట్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు.

బుధవారం చిక్కపేట సమీపంలోని కెంపేగౌడ రోడ్డులో సెక్యూరిటీ గార్డు మూత్రవిసర్జనకు వెళ్లిన సమయంలో డోమినిక్ రాయ్ రూ.1.37 కోట్లు ఉన్న నగదుతో సహ పరారైనాడు. తరువాత వసంత్ నగర్ లోని మౌంట్ కార్మల్ కాలేజ్ సమీపంలో రూ. 2,000 నోట్లు ఉన్న రూ. 45 లక్షలు గన్, వ్యాన్ నడి రోడ్డులో వదిలేశాడు.
వ్యాన్ లో ఉన్న రూ.92 లక్షలు లూటీ చేసి భార్య, బిడ్దతో కలిసి బెంగళూరు నుంచి పరారైనాడు. ఇతను కచ్చితంగా తమిళనాడు పారిపోయి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు ప్రత్యేక బృందాలు తమిళనాడు చేరుకుని అతని కోసం గాలిస్తున్నారు.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications