ఒకే ఒక్క స్కూటర్, 635 పోలీసు కేసులు, రూ. 63, 500 ఫైన్: ఓనర్ ఏం చేశాడో చూడండి!
మైసూరు: ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘనకు పాల్పడిన ఒక స్కూటర్ ను గుర్తించిన పోలీసులు షాక్ కు గురైనారు. స్కూటర్ యజమాని చెల్లించాల్సిన అపరాదరుసుం వివరాలు తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులకు దిమ్మతిరిగిపోయింది.
స్కూటర్ విక్రయించినా అంత డబ్బు రాదని తెలుసుకున్న కర్ణాటకలోని మైసూరు నగర ట్రాఫిక్ పోలీసులు వేరే మార్గాలు అన్వేషిస్తున్నారు. మైసూరు నగరంలో ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించి వాహనాలు నడుపుతున్న వారిని ఎన్ఆర్ నగర్ ట్రాఫిక్ పోలీసులు గుర్తిస్తున్నారు.

వాహనాలు పరిశీలిస్తున్న ట్రాఫిక్ పోలీసులు కే. మధుప్రసాద్ అనే వ్యక్తి హోండా ఆక్టీవా స్కూటర్ ను గుర్తించారు. కే. మధుప్రసాద్ స్కూటర్ నెంబర్ ను ట్రాఫిక్ పోలీసులు వారి దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ పరికరంలో టైప్ చేశారు. అంతే ట్రాఫిక్ పోలీసుల దిమ్మతిరిగిపోయింది.
కే. మధుప్రసాద్ హోండా ఆక్టీవా స్కూటర్ తో 635 సార్లు ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించి నడిపారని గుర్తించారు. కే. మధుప్రసాద్ ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించినందుకు రూ. 63, 500 చెల్లించాలని పోలీసులు చెప్పారు. స్కూటర్ విక్రయించినా అంత డబ్బురాదని తెలుసుకున్న కే. మధుప్రసాద్ స్కూటర్ ను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు.
స్కూటర్ విక్రయించినా రూ. 63, 500 రాదని, అపరాదరుసుం వసూలు చెయ్యడానికి వేరే మార్గం ఆలోచిస్తున్నామని మైసూరు నగరంలోని ఎన్ఆర్ నగర ట్రాఫిక్ పోలీసులు అంటున్నారు. ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించి వాహనం నడిపి కే. మధుప్రసాద్ రికార్డు సృష్టించాడని మైసూరు నగరంలో జోరుగా చర్చ జరుగుతోంది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications