ఐటీసీ ఎఫెక్ట్: ఎల్ఐసీకీ భారీ దెబ్బ, అరగంటలో రూ7వేల కోట్ల నష్టం
ఐటీసీ దెబ్బకు లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ)తోపాటు ఇతర బీమా సంస్థల షేర్లు కుప్పకూలాయి. సుమారు 26ఏళ్ల కనిష్టస్థాయిల వద్ద ఐటీసీ ఐటీసీ స్టాక్ అతిపెద్ద పతనాన్ని నమోదు చేసింది.
న్యూఢిల్లీ: సిగరేట్ ఉత్పత్తుల తయారీలో అగ్రగామిగా కొనసాగుతున్న ఐటీసీ దెబ్బకు
లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ)తోపాటు ఇతర బీమా సంస్థల షేర్లు కుప్పకూలాయి. సుమారు 26ఏళ్ల కనిష్టస్థాయిల వద్ద ఐటీసీ ఐటీసీ స్టాక్ అతిపెద్ద పతనాన్ని నమోదు చేసింది. దీంతో ఎల్ఐసీకి అరగంటలో రూ. 7000కోట్ల నష్టం వాటిల్లింది.
ఐటీసీ సిగరేట్ కంపెనీలో 2017 జూన్ 30 నాటికి ఎల్ఐసీ 16.29శాతం స్టేక్‌ను కలిగి ఉంది. దీని ప్రభావంతో ఎల్ఐసీ భారీ మొత్తంలో నష్టపోవాల్సి వచ్చింది. ఏకంగా అరగంటలో రూ.7వేల కోట్ల నష్టాలను నమోదు చేయడం ఇది తొలిసారి కావడం గమనార్హం.

కాగా, ఈ నష్టాలన్నింటికీ సోమవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ భేటీలో సిగరేట్ ఉత్పత్తులపై సెస్‌ను పెంచుతున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించడమే ప్రధాన కారణంగా నిలిచింది. 28శాతం జీఎస్టీతోపాటు అదనంగా 5శాతం సెస్ ను విధిస్తున్నట్లు జైట్లీ తెలిపారు. దీంతో ఐటీసీ కంపెనీ షేర్లు మంగళవారం ఉదయం ట్రేడింగ్‌లో 15శాతం మేర నష్టాలను ఎదుర్కొన్నాయి.
ఈ పతనంతో ఐటీసీ కంపెనీ మార్కెట్ విలువ రూ.3.37లక్షల కోట్లకు పడిపోయింది. కాగా, సోమవారం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ.3.9లక్షల కోట్లు. అంటే దాదాపు రూ.60వేల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద ఆవిరైందన్నమాట. ఐటీసీ దెబ్బకు సెన్సెక్స్ ఈ ఏడాదిలో అతిపెద్ద పతనాన్ని నమోదు చేసింది.
ఈ నష్టాలు ఎల్ఐసీకి భారీ దెబ్బకొట్టాయి. ఎల్ఐసీతోపాటు ఐటీసీలో పెట్టుబడులు పెట్టిన ఇతర ఇన్స్యూరర్స్‌కు కూడా నష్టాలు తప్పలేదు. మొత్తంగా చూసుకుంటే ఇన్స్యూరెన్స్ కంపెనీలకు రూ. 10వేల కోట్లను నష్టం వాటిల్లింది. గత నాలుగేళ్లుగా ఐటీసీలో తన వాటాను పెంచుకుంటూ వస్తున్న ఎల్ఐసీ తొలిసారి ఇంత పెద్ద స్థాయిలో నష్టం జరిగింది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications