బంపరాఫర్: బికినీ ఎయిర్‌లైన్స్‌లో టికెట్ ధర రూ.9..ఎంచక్కా ఎంజాయ్ చేయండి

న్యూఢిల్లీ: వియత్నాం లోబడ్జెట్ విమానయాన సంస్థ వియెట్‌జెట్ తమ ప్రయాణికుల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఏడాది చివరిలో భారత్‌కు రెండు డైరెక్ట్ ఫ్లయిట్‌లను నడపనుంది. వియత్నాంలోని హోచిమిన్‌ సిటీ రాజధాని హనోయ్‌ నుంచి న్యూఢిల్లీకి బయలుదేరుతాయి. సాధారణంగా వియెట్ జెట్ ఎయిర్‌లైన్స్‌ను బికినీ ఎయిర్‌లైన్స్‌గా పిలుస్తారు. దీని వెనక కారణం కూడా ఉంది. ఇందులోని మహిళా సిబ్బంది బికినీ ధరించి కనిపిస్తారు. ఇక భారత్‌కు తొలిసారిగా ప్రారంభిస్తున్న తమ సర్వీసులపై బంపర్ ఆఫర్ ప్రకటించింది యాజమాన్యం.

ఈ ఏడాది డిసెంబర్ 6వ తేదీనుంచి మార్చి 28,2020 వరకు హోచిమిన్ సిటీ నుంచి ఢిల్లీకి విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తాయని తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఈ సర్వీసులు ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం ఆదివారాల్లో బయలుదేరుతాయని పేర్కొంది. ఇక హనోయ్ నుంచి ఢిల్లీకి బయలు దేరే విమానం డిసెంబర్ 7, 2019 నుంచి మార్చి 28 2020 వరకు ప్రతి మంగళవారం, గురువారం, శనివారాల్లో బయలుదేరుతుందని వెల్లడించింది. వియెజెట్ ఎయిర్‌లైన్స్ రాత్రి 7 గంటలకు బయలుదేరి న్యూఢిల్లీకి రాత్రి 10 గంటల 50 నిమిషాలకు చేరుకుంటుంది. ఆ తర్వాత న్యూఢిల్లీలో రాత్రి 11:50 గంటలకు బయలుదేరి హోచిమిన్ సిటీకి ఉదయం 6:10 నిమిషాలకు చేరుకుంటుంది.

Rs.9 a ticket: Vietnams airlines put offer to Hanoi

ఇదంతా ఇలా ఉంటే ప్రారంభం సందర్భంగా బంపర్ ఆఫర్ ప్రకటించింది యాజమాన్యం. ఆగష్టు 22, 2019 వరకు టికెట్లపై ఆఫర్ ఇచ్చింది. ఇక హనోయ్‌కు వెళ్లేందుకు విమానం టికెట్‌ను రూ. 9గా ప్రకటించింది. అయితే వ్యాట్, ఎయిర్‌పోర్ట్ ఛార్జీ, ఇతర సర్‌ఛార్జీలు అదనంగా ఉంటాయి. అయితే కేవలం 8000 టికెట్లనే జారీ చేసింది. అయితే ముందుగా బుక్ చేసుకున్నవారికే టికెట్లు లభిస్తాయని పేర్కొంది. ఇక వియెట్‌జెట్ ఎయిర్‌లైన్స్‌తో భారత్‌ను ఇండోనేషియా, సింగపూర్, మలేషియా, థాయ్‌లాండ్, సౌత్ కొరియా, జపాన్, చైనా దేశాలను అనుసంధానం చేసినట్లయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+