రూ.93.52 లక్షల కొత్త 2 వేల నోట్లు సీజ్, 7గురి అరెస్టు
జైపూర్‌లో ఐటి అధికారులు రూ.93.52 లక్షల కొత్త నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఏడుగురిని అరెస్టు చేశారు.
జైపూర్: పోలీసులు జైపూర్‌లో రూ.93.52 లక్షల విలువ చేసే 2 వేల రూపాయల కొత్త నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి రెండు వేర్వేరు ఘటనల్లో ఏడుగురిని అరెస్టు చేశారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని 64 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ిందులో రూ.58 లక్షలు కొత్త 2 వేల నోట్లు కావడం విశేషం.
సిఐడి క్రైమ్ బ్రాంచ్, స్థానిక పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో భాగంగా రద్దయిన నోట్లను మార్పిడి చేయడానికి ఆ ప్రాంతంలో తిరుగాడుతున్న కారును అడ్డగించారు. మొత్తం 6 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు, అవన్నీ వంద నోట్లు అని డిసిపి (పశ్చిమం) అశోక్ గుప్తా చెప్పారు.

తాము నగదు స్వాధీనం చేసుకున్న విషయాన్ని పోలీసులు ఆదాయం పన్ను శాఖాధికారులకు సమాచారం అందించారు. ఈ విషయంపై వారు దర్యాప్తు చేస్తున్నారు.
మరో సంఘటనలో బికనూరుకు చెందిన వ్యాపారిని దోచుకున్నారనే ఆరోపణపై ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు వారి నుంచి రూ.83 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అవన్నీ కొత్త 2 వేల రూపాయల నోట్లు. ఐదుగురు నిందితుల్లో ముగ్గురిని అరెస్టు చేశారు. వారంతా వ్యాపారి రాజేష్ మిత్రులు.
వారి నుంచి 28 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన రెండు, మూడు రోజుల క్రితం చోటు చేసుకుంది. వారిని కలిసి రూ. 500, రూ.1000 నోట్లను మార్చుకోవడానికి రాజేష్ రావడంతో వారు అతని వద్ద ఉన్న నగదు దోచుకున్నారు. బాధితుడు సంఘటనపై ఫిర్యాదు చేశాడు.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications